ఇస్లాంపై ఇటలీ ప్రధాని వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం

Published on Mon, 12/18/2023 - 11:17

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ ఇస్లాం మతంపై చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఇస్లాం సంస్కృతి, యూరోపిన్‌ నాగరికతలోని విలువలు.. హక్కులకు చాలా తేడాలు ఉన్నాయి. అందుకే యూరప్‌లో ఇస్లాంకు చోటు ఉండబోదని అభిప్రాయపడ్డారామె. ఈ సందర్భంలో సౌదీ అరేబియాను, షరియా చట్టాల కఠినతత్వాన్ని ఆమె తప్పుబట్టారు.

ఇస్లాం సంస్కృతికి,  మా యూరోపియన్‌ నాగరికతకు చాలా తేడాలున్నాయ్‌. సౌదీ అరేబియా.. ఇటలీలో పలు చోట్ల ఇస్లామిక్‌ సెంటర్లకు నిధులు అందిస్తున్నాయి. అది తప్పు. ఆ విషయంలో కూడా నాకు సదాభిప్రాయం లేదు అని అన్నారామె. ఈ సందర్భంగా.. సౌదీ అరేబియాలో పాటిస్తున్న కఠినమైన షరియా చట్టాలను ఆమె తప్పుబట్టారు.

షరియా చట్టాల్లో మతభ్రష్టత్వము, స్వలింగ సంపర్కం వంటి విధానాలు తీవ్రమైన నేరాలని తెలిపారు. షరియా అంటే వ్యభిచారానికి కఠిన శిక్ష విధించడం, స్వలింగ సంపర్కాన్ని నేరంగా భావించడమని తెలిపారు. ఈ విధానాలను ఎక్కడైనా అమలుచేయాలని తెలిపారు. యూరప్‌లోని తమ నాగరికత విలువలకు.. ఇస్లాం విధానాల మధ్య చాలా తేడాలు ఉన్నాయని.. అలా సారూప్యత సమస్య తలెత్తుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, బిలియనీర్‌ ఎలన్‌ మ్కాస్‌లు కూడా పాల్గొన్నారు.

చదవండి: Mexico: నేరస్తుల చేతికి ‍ప్రభుత్వ డేటా? మెక్సికోలో ఏం జరుగుతోంది?

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)