Breaking News

లేడీ ‘రోమియో’: షాపుల్లో దూరి.. మగాళ్లపై..

Published on Tue, 07/14/2026 - 13:55

ఇస్తాంబుల్‌: టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో గత కొన్ని వారాలుగా చోటుచేసుకుంటున్న వింత లైంగిక వేధింపుల ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. సాధారణంగా పురుషులు మహిళలను వేధించే ఘటనలు వెలుగుచూస్తుండగా, ఇక్కడ ఒక మహిళే పురుషుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం గమనార్హం. నగరంలోని ఉమ్రానియే, ఇకిటెల్లి వంటి వివిధ ప్రాంతాల్లోని దుకాణాలు, కార్యాలయాల్లోకి చొరబడుతున్న 30 ఏళ్ల ‘జెడ్‌ఈ’అనే మహిళ, అక్కడ పనిచేసే పురుష ఉద్యోగులను తాకడానికి, ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ వేధింపులకు గురిచేస్తోంది. తాను విద్యార్థినని, ఖర్చుల కోసం సెంటు బాటిళ్లు అమ్ముతున్నానని చెబుతూ లోపలికి ప్రవేశిస్తున్న ఆమె, పురుషులు ప్రతిఘటిస్తే వారిపై దాడికి దిగుతూ, దూషిస్తోంది.

దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో, రంగంలోకి దిగిన ఇస్తాంబుల్ పోలీస్ శాఖ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి సదరు మహిళను అరెస్ట్ చేసింది. అనంతరం ఆమెను కుచుక్‌సెక్మెస్ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే, ఆ మహిళ బైపోలార్ డిజార్డర్ (మానసిక రుగ్మత)తో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు, ఆమెను ప్రస్తుతం ఒక ఆరోగ్య సంస్థలో వైద్య పరిశీలనలో ఉంచారు. పురుషులు ఇలాంటి పనులు చేస్తే నేరస్తులని, మహిళ చేస్తే మానసిక రోగిగా ముద్రిస్తారా అంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా చర్చిస్తున్నారు.
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)