Breaking News

కారుపై ఇజ్రాయెల్ సైనికుల కాల్పులు.. పసికందు మృతి

Published on Sat, 06/06/2026 - 22:00

ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని హెబ్రాన్‌లో ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై ఇజ్రాయెల్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఏడు నెలల పసికందు మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆ పసికందు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు.

బెత్లెహెమ్ యూనివర్శిటీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న తండ్రి ఫహద్ అబు హైకల్ మీడియాతో మాట్లాడుతూ ఒక బుల్లెట్ మొదట తన చేతికి తగిలి.. ఆ తర్వాత వెనుక సీట్‌లో తల్లితో కలిసి కూర్చున్న తన కుమారుడికి తగిలిందని చెప్పారు. సైనికుడు నన్ను ఆగమని సైగ చేశారు. నేను కారును పూర్తిగా ఆపి, స్టీరింగ్ వీల్‌పై నా చేతులు పైకెత్తాను. ఆ వెంటనే వారు వాహనంపై కాల్పులు జరిపారని ఆయన తెలిపారు.

కాల్పులు జరిగిన సమయంలో తాము తమ 11 ఏళ్ల కుమారుడు, తల్లితో కలిసి ప్రయాణిస్తున్నట్లు అబు హైకల్ చెప్పారు. కారులో ఉన్నవారిని గుర్తించడంలో సైనికులు పొరపాటు పడి ఉంటారనే వాదనను ఆయన పూర్తిగా తిరస్కరించారు. ఆ సైనికుడు నాకు కేవలం 10 మీటర్ల దూరంలో ఉన్నాడు. అతను నన్ను, నా భార్యను, పిల్లలను చూశాడు. కారు కిటికీలకు నల్లటి గ్లాసులు లేవు. అది పట్టపగలు కావడం వల్ల అంతా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కారులో కుటుంబం ప్రయాణం చేస్తుందని ఆవ్యక్తికి తెలియదా?’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై సమీక్షిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఒక వాహనం తమ వైపు వేగంగా దూసుకువస్తోందని భావించి సైనికులు కాల్పులు జరిపినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తెలిపినట్లు 'ది గార్డియన్' పేర్కొంది. మిలిటరీ సమాచారం ప్రకారం.. సైనికులు ఒక వాహనం తమ వైపు వేగంగా దూసుకురావడాన్ని గమనించారు.. అందులోని ఓ సైనికుడు ఆ వాహనంపై కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు పాలస్తీనియన్లు గాయపడ్డారు.

వారిని వైద్య చికిత్స కోసం తరలించామని ఐడీఎఫ్‌  తెలిపింది. ఏదైనా తప్పు జరిగి ఉంటే.. సంబంధం లేని వ్యక్తులకు జరిగిన నష్టానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని ఐడీఎఫ్‌ పేర్కొంది. ప్రాథమిక మిలిటరీ విచారణలో గాయపడిన వారు ఎలాంటి శత్రుత్వ కార్యకలాపాలలో పాలుపంచుకోని సాధారణ పౌరులుగా తేలింది. బాధ్యులను శిక్షించాలని తండ్రి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, సంబంధిత సైనికుడిని బాధ్యుడిని చేయాలని అబు హైకల్ డిమాండ్ చేశారు.

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)