గాజాపై ఆగని ఇజ్రాయెల్‌ దాడులు

Published on Wed, 10/01/2025 - 06:33

గాజా సిటీ: గాజా వ్యాప్తంగా మంగళవారం కూడా ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగాయి. వైమానిక దాడులు, కాల్పుల ఘటనల్లో 31 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు వివిధ ఆస్పత్రులు తెలిపాయి. నెట్‌జరిమ్‌ కారిడార్‌ వద్ద ఏర్పాటైన ఆహార పంపిణీ కేంద్రం వద్దకు చేరిన వారిపై ఇజ్రాయెల్‌ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 17 మంది చనిపోగా 33 మంది గాయపడినట్లు అల్‌ ఔదా ఆస్పత్రి తెలిపింది. నుసెయిరత్‌ శరణార్థి శిబిరంలోని ఓ టెంటుపై జరిగిన మరో దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. మువాసిలో శరణార్థులుండే రెండు టెంట్లపై ఇజ్రాయెల్‌ బాంబులు వేసింది. 

ఒక ఘటనలో నలుగురు మహిళలు, చిన్నారి సహా ఏడుగురు, మరో ఘటనలో..ఏడు నెలల గర్భవతి, చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, గడిచిన 24 గంటల వ్యవధిలో గాజాలో 160కి పైగా హమాస్‌ లక్ష్యాలపై దాడులు జరిపి పలువురు మిలిటెంట్లను చంపామని, ఆయుధాల గిడ్డంగుల్ని, నిఘా పోస్టులను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించింది. ఈ పరిణామం...గాజాలో రెండేళ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతామంటూ సోమవారం ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ సమక్షంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన శాంతి ప్రతిపాదనపై పాలస్తీనా ప్రజల్లో అనుమానాలు రేపుతోంది. ‘ఇది శాంతి ప్రణాళిక కాదు..లొంగుబాటు ప్రణాళిక. మమ్మల్ని మళ్లీ వలస పాలనలోకి నెట్టే ప్రయత్నం’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)