Breaking News

ఇజ్రాయెల్ దాడులు.. పలువురు జర్నలిస్టులు మృతి

Published on Thu, 12/26/2024 - 11:49

జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన దాడిలో ఐదుగురు జర్నలిస్టులు మరణించారని ఎన్‌క్లేవ్ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సెంట్రల్‌ గాజాలోని నుసిరత్‌లో ఉన్న అల్-అవ్దా ఆసుపత్రి పరిసరాల్లో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో ఐదుగురు జర్నలిస్టులు మరణించారు. వీరంతా అల్-ఖుద్స్ అల్-యూమ్ టెలివిజన్ ఛానెల్‌లో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. పాలస్తీనా మీడియా కథనాల ప్రకారం.. జర్నలిస్టులు ఆసుపత్రి లోపల నుంచి వస్తున్న సమయంలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేసింది. దీంతో, వారు చనిపోయారు అని తెలిపింది. ఇక, మరణించిన జర్నలిస్టులను ఫాది హస్సౌనా, ఇబ్రహీం అల్-షేక్ అలీ, మహ్మద్ అల్-లదా, ఫైసల్ అబూ అల్-కుమ్సన్, అయ్మాన్ అల్-జాదీగా గుర్తించినట్లు అల్ జజీరా నివేదించింది.

ఇదిలా ఉండగా.. అంతకుముందు ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందగా మరో 20 మంది గాయపడ్డారు. గాజా నగరంలోని జైటౌన్ పరిసరాల్లోని ఒక ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడి సందర్భంగా వీరంతా గాయపడ్డారు. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)