Breaking News

హెజ్‌బొల్లా క్షిపణి కేంద్రంపై ఇజ్రాయెల్‌ దాడి

Published on Sat, 09/14/2024 - 05:00

మస్యాఫ్‌: సిరియాలోని హెజ్‌బొల్లా క్షిపణి తయారీ కేంద్రంపై ఇజ్రాయెల్‌ ప్రత్యేక దళాలు దాడి చేశాయి. లెబనాన్‌ సరిహద్దుకు 25 మైళ్ల దూరంలో ఉన్న మస్యాఫ్‌ నగర సమీపంలో సోమవారం చేపట్టిన ఈ దాడిలో 18 మంది మృతి చెందారు. దాడి చిత్రాలను అమెరికా మీడియా బయట పెట్టడంతో వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. భూగర్భంలోని ఈ కేంద్రాన్ని ధ్వంసం చేయడానికి ఇజ్రాయెల్‌ సాహసోపేతమైన ఆపరేషన్‌ చేపట్టింది.

 వైమానిక దళానికి చెందిన ఎలైట్‌ షాల్డాగ్‌ యూనిట్‌ బలగాలు హెలికాప్టర్ల నుంచి దిగి, ఇరాన్‌ నిర్మించిన కేంద్రంలో పేలుడు పదార్థాలను అమర్చాయి. ఘటనలో 18 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. హెజ్‌బొల్లాకు క్షిపణుల సరఫరాను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ ఈ దాడికి పూనుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ అపరేషన్‌పై ముందుగానే అమెరికాకు ఇజ్రాయెల్‌ సమాచారం ఇచ్చిందని సమాచారం. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. 
 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు