Breaking News

గాజాలో మరో 26 మంది  మృత్యువాత 

Published on Mon, 06/23/2025 - 04:55

టెల్‌ అవీవ్‌/గాజా: గాజాలో ఆదివారం ఇజ్రాయెల్‌ ఆర్మీ జరిపిన దాడుల్లో కనీసం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆహార పంపిణీ కేంద్రం జరిగిన కాల్పుల్లో అసువులు బాసిన 11 మంది ఉన్నారు. మరో 20 మంది గాయపడ్డారు. దక్షిణ గాజాలోని అల్‌–మవాసిలో శరణార్ధులున్న టెంట్‌పై జరిగిన డ్రోన్‌ దాడిలో ముగ్గురు చనిపోగా పదుల సంఖ్యలో జనం గాయపడ్డారని వఫా వార్తా సంస్థ తెలిపింది. నుసెయిరత్‌లో జరిగిన వైమానిక దాడిలో నలుగురు చనిపోయారు. ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటించిన ‘సేఫ్‌ జోన్‌’లోనే ఈ టెంట్‌ ఉందని పేర్కొంది. 

గడిచిన 48 గంటల వ్యవధిలో గాజాలో ఇజ్రాయెల్‌ ఆర్మీ యథేచ్ఛగా సాగించిన మారణకాండలో కనీసం 202 మంది చనిపోగా 1,037 మంది క్షతగాత్రులుగా మిగిలారు. కాగా, గాజాలో సోదాల సమయంలో హమాస్‌ ఎత్తుకుపోయిన వారిలో ముగ్గురి మృతదేహాలు బయటపడ్డాయని ఇజ్రాయెల్‌ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. వీరిని యోనాటన్‌ సమెరనో(21), ఒఫ్రా కెయిడర్‌(70), షే లెవిన్సన్‌(19)గా గుర్తించింది. 2023 అక్టోబర్‌ 7న హమాస్, ఇతర జిహాదీ గ్రూపులు జరిపిన మెరుపుదాడిలో వీరు చనిపోయారని వివరించింది. హమాస్‌ చెరలో ఇప్పటికీ 50 మంది వరకు ఉన్నారని, వీరిలో సగం కంటే తక్కువమందే సజీవులుగా ఉన్నట్లు భావిస్తున్నామంది.  

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)