Breaking News

ఇజ్రాయెల్‌ సైన్యం చెరలో గాజా ఆస్పత్రి సిబ్బంది

Published on Sun, 10/27/2024 - 07:22

కైరో: గాజాపై ఇజ్రాయెల్‌ సైన్యం నిరంతర దాడులకు తెగబడుతోంది. అయితే తాజాగా మరో పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర గాజాలోని ఆస్పత్రి సముదాయం నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గాయి. అయితే ఈ ఆస్పత్రిని టార్గెట్ చేసి, దాడికి పాల్పడిన ఇజ్రాయెల్‌ సైనికులు ఇక్కడి వైద్య సిబ్బందిని, కొంతమంది రోగులను తమ అదుపులోకి తీసుకున్నారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో అనేక ఇళ్లపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 30 మంది మృతిచెందారని పాలస్తీనా అధికారిక వార్తా సంస్థ వాఫా తెలిపింది. మరోవైపు గాజా స్ట్రిప్‌లోని బీట్ లాహియా ప్రాంతంలోని ఒక భవనంలో ఉన్న హమాస్ మిలిటెంట్లపై ఆయుధాలను ఉపయోగించి, దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు.

గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రసారం చేసిన ఫుటేజీలో ఇజ్రాయెల్ దళాలు అక్కడి నుంచి ఉపసంహరించుకున్న దృశ్యాలతో పాటు అనేక భవనాలు దెబ్బతిన్న దృశ్యాలు ప్రసారమయ్యాయి. 70 మంది సభ్యుల ఆస్పత్రి బృందంలో 44 మందిని సైన్యం అదుపులోకి తీసుకుంది. అయితే ఆస్పత్రి డైరెక్టర్‌తో సహా 14 మందిని విడుదల చేసినట్లు సైన్యం  తెలిపింది. కాగా ఆసుపత్రి నివేదికపై వ్యాఖ్యానించడానికి ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి నిరాకరించారు. 

ఇది కూడా చదవండి: ట్రంప్, వాన్స్‌ లక్ష్యంగాచైనా సైబర్‌ దాడి

#

Tags : 1

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)