Breaking News

ఇజ్రాయెల్‌ కాల్పుల్లో 70 మంది మృతి ఆహారం కోసం వేచి ఉండగా దారుణం

Published on Wed, 06/18/2025 - 04:46

గాజా: ఆకలితో అలమటిస్తున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ బలగాల క్రౌర్యం అంతకంతకూ తీవ్రరూపం దాల్చుతోంది. గాజా దక్షిణ ప్రాంతంలోని ఖాన్‌యూనిస్‌ నగరంలోని రోడ్డుపక్కన ఆహారం ట్రక్కుల కోసం ఎదురుచూస్తున్న వారిపై మంగళవారం జరిగిన కాల్పుల్లో ఏకంగా 70 మంది చనిపోగా 200 మందికిపైగా గాయపడ్డారు. ఇజ్రాయెల్‌ ఆర్మీ డ్రోన్లు, మెషీన్‌ గన్లు, ట్యాంక్‌ షెల్స్‌ను అన్నార్తులపైకి ఒక్కసారిగా పెద్దపెట్టున కురిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

కాగా, తమ వద్దకు తీసుకువచ్చిన క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని, మరణాలు మరింత పెరిగే అవకాశాలున్నాయని నాస్సెర్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రఫాలోని ఆహార పంపిణీ కేంద్రం వద్ద సోమవారం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో 38 మంది చనిపోవడం తెల్సిందే.

అమెరికా–ఇజ్రాయెల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఆహార పంపిణీ కేంద్రాల వద్ద నిత్యం కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఇజ్రాయెల్‌ కాల్పుల్లో మంగళవారం అత్యధికులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఆహార నిల్వలు హమాస్‌ శ్రేణుల చేతుల్లో పడకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని ఇజ్రాయెల్‌ అంటోంది. అయితే, నూతన పంపిణీ వ్యవస్థ గాజా ప్రజల అవసరాన్ని ఏమాత్రం తీర్చలేదని, ఇలాగే కొనసాగిస్తే పాలస్తీనియన్లు ఆకలి చావులు తీవ్రతరం కాక తప్పదని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు