Breaking News

భయానక వీడియో.. ఇజ్రాయెల్‌ భీకర దాడులు

Published on Sun, 10/27/2024 - 07:28

బీరుట్‌: ఇజ్రాయెల్‌, హిజ్బుల్లా మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై దాడులకు సంబంధించిన భీకర వీడియోను ఇజ్రాయెల్‌ సైన్యం విడుదల చేసింది. భయానక బాంబు దాడి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తోంది. హిజ్బుల్లా టార్గెట్‌గా ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడుతోంది. ఇక, తాజాగా ఇరాన్‌ మద్దతు ఉన్న హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. భూగర్భంలో ఉన్న హిజ్బుల్లా నేతలను టార్గెట్‌ చేసి దాడులు చేసింది. బాంబు దాడిలో అక్కడున్న నివాసాలు అన్ని ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్‌ దాడి చేసిన ప్రాంతంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఆహారం మరియు కమ్యూనికేషన్ పరికరాల ఉ‍న్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. గాజా యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పీక్‌ స్టేజ్‌కు చేరుకున్నాయి. అక్టోబరు 1న తమ దేశంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌పై ఇజ్రాయెల్‌  నేరుగా విరుచుకుపడింది. దాదాపు 100 యుద్ధ విమానాలు, డ్రోన్లు.. జోర్డాన్, సిరియా, ఇరాక్‌ గగనతలాల మీదుగా దాదాపు 2,000 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఇరాన్‌లోని సైనిక స్థావరాలపై బాంబుల, క్షిపణుల వర్షం కురిపించాయి. 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)