Breaking News

హమాస్‌, లెబనాన్‌తో యుద్ధం.. ఇజ్రాయెల్‌ సంచలన నిర్ణయం!

Published on Fri, 07/12/2024 - 20:52

జెరూసలెం: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య భీకర యుద్ధం నడుస్తున్న వేళ ఇజ్రాయెల్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మిలటరీలో పని చేస్తున్న ప్రతీ పురుషుడు మూడేళ్ల పాటు పని చేయాలన్న నిబంధనను తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సెక్యూరిటీ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్టు వార్త సంస్థ వైనెట్‌ కథనంలో తెలిపింది.

కాగా, ఓ వైపు హమాస్‌, మరోవైపు లెబనాన్‌ దాడులు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు ప్రతీ పురుషుడు 34 నెలల పాటు తప్పనిసరిగా మిలటరీలో పని చేయాలన్న నిబంధన ఉండగా.. దీన్ని మూడేళ్లకు పెంచినట్లు సమాచారం. ఈ మేరకు సెక్యూరిటీ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక, తాజా నిబంధనలు మరో ఎనిమిదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉంది. సెక్యూరిటీ కేబినెట్‌ నిర్ణయాలను ఆదివారం నిర్వహించబోయే పూర్తిస్థాయి కేబినెట్‌ సమావేశంలో ఓటింగ్‌కు పెట్టనున్నారు.

ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌.. హమాస్‌, లెబనాన్‌పై ఒకేసారి యుద్ధం చేయాల్సి వస్తే మిలటరీ ఎక్కువ సంఖ్యలో ఉండాలన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కాగా, ఈ రెండు ఉగ్రవాద సంస్థలకు ఇరాన్‌ పూర్తి మద్దతు ఉంది. వారిని ఎదుర్కోవాలంటే కచ్చితంగా భారీ సంఖ్యలో సైన్యం ఉండాలి. అందుకే ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. హమాస్‌తో యుద్ధంలో తాము దాదాపుగా విజయానికి చేరువైనట్టు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)