Israel-Hamas war: గాజాకు సాయం పునరుద్ధరించండి

Published on Mon, 01/29/2024 - 05:57

రఫా: గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనియన్లకు అందించే మానవతా సాయాన్ని యథా ప్రకారం కొనసాగించాలని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనీ గుటెరస్‌ సంబంధిత దేశాలను కోరారు. లేని పక్షంలో 20 లక్షల మందికి పైగా శరణార్థులకు అందాల్సిన సాయం, పునరావాస కార్యక్రమాల్లో భారీగా కోత పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో ఇప్పటికే తీవ్ర మానవీయ సంక్షోభం నెలకొందని అన్నారు.

గత ఏడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై హమాస్‌ మిలిటెంట్లు మెరుపుదాడికి దిగిన విషయం తెలిసిందే. పాలస్తీనా శరణార్థులకు సాయం, పునరావాసం కోసం పనిచేస్తున్న ఐరాస సిబ్బందిలో డజను మంది ఆ దాడిలో పాల్గొన్నట్లు ఆరోపణలు రావడంతో అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ తదితర 8 దేశాలు సాయం నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

పాలస్తీనా శరణార్థులకు అందుతున్న సాయంలో ఈ దేశాల వాటా దాదాపు 60 శాతం వరకు ఉంటుంది. సాయం ఆగిపోతే పాలస్తీనా శరణార్థులకు అవసరమైన కనీస ఆహార నిల్వలు సైతం మరికొద్ది రోజుల్లోనే అడుగంటే ప్రమాదముందని భావిస్తున్నారు. హమాస్‌కు తోడ్పాటు అందించినట్లుగా భావిస్తున్న 12 మంది ఉద్యోగుల్లో ఇప్పటి వరకు 9 మందిని బాధ్యతల నుంచి తొలగించారు. ఒకరు చనిపోగా మరో ఇద్దరిని గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)