Breaking News

Israel-Hamas war: ఇజ్రాయెల్‌–హమాస్‌ ఒప్పందం పొడిగింపు

Published on Fri, 12/01/2023 - 05:22

గాజా్రస్టిప్‌/జెరూసలేం:   కాల్పుల విరమణ  ఒప్పందాన్ని మరొక రోజు  పొడిగించేందుకు ఇజ్రాయెల్‌–హమాస్‌ గురువారం అంగీక రించాయి. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగిసింది. బందీలంతా  ఇంకా విడుదల కాకపోవడం, గాజాలోని పాలస్తీనియన్లకు మరింత మానవతా సాయం అందాల్సి ఉండడంతో ఒప్పందం పొడిగింపునకే ఇరుపక్షాలు మొగ్గుచూపాయి. గాజాలోని శాంతి కోసం ఇజ్రాయెల్, హమాస్‌పై అంతర్జాతీయ సమా జం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. 

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ బుధవారం రాత్రి ఇజ్రాయెల్‌ చేరుకున్నారు. ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య ఘర్షణలకు తెరదించే దిశగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నట్లు తెలిసింది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్‌ మిలిటెంట్లు ఇప్పటిదాకా 73 మంది ఇజ్రాయెలీలను, 24 మంది ఇతర దేశస్తులను విడుదల చేశారు. ఇంకా 126 మంది హమాస్‌ చెరలో బందీలుగా ఉన్నట్లు అంచనా.  
 
జెరూసలేంలో కాల్పులు.. ముగ్గురి మృతి

జెరూసలేంలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. బుధవారం ఉదయం 7.40 గంటలకు వీచ్‌మ్యాన్‌ వీధిలో బస్‌స్టాప్‌లో నిల్చున్న ప్రయాణికులపై ఇద్దరు సాయుధ పాలస్తీనియన్‌ దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఇజ్రాయెలీలు మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండుగులు హతమయ్యారు. వారిద్దరూ తూర్పు జెరూసలేంకు చెందిన సోదరులని తెలిసింది. గతంలో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొని జైలుకు వెళ్లొచ్చారు. 

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)