Breaking News

Israel-Hamas war: ఆగని దారుణ దాడులు

Published on Thu, 07/11/2024 - 05:33

డెయిర్‌ అల్‌ బాలాహ్‌: గాజా భూతలంపై ఇజ్రాయెల్‌ గగనతల దాడులు ఆగట్లేవు. వరసగా రెండో రోజైన బుధవారం తెల్లవారుజామున సైతం సెంట్రల్‌ గాజాలోని డెయిర్‌ అల్‌ బాలాహ్‌ పట్టణంపై ఇజ్రాయెల్‌ భీకర దాడులకు తెగబడింది. ఇజ్రాయెల్‌ స్వయంగా ప్రకటించిన ‘సేఫ్‌ జోన్‌’లో తలదాచుకుంటున్న వారిపైనా దాడులు చేసింది. దీంతో ఈ దాడుల్లో ఆరుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలుసహా 20 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. 

నుసేరాత్‌ శరణార్థి శిబిరంపై దాడిలో ఐదుగురు చిన్నారులుసహా 12 మంది చనిపోయారని అల్‌–అల్సా స్మారక ఆస్పత్రి ప్రకటించింది. డెయిర్‌ అల్‌ బాలాహ్‌ పట్టణంలోని మరో ఇంటిపై జరిగిన దాడిలో ఒక చిన్నారి, ముగ్గురు మహిళలు, నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ రెండు ఇళ్లు ఇప్పటికే ఇజ్రాయెల్‌ ప్రకటించిన ‘మానవతా రక్షిత ప్రాంతం’లో ఉండటం గమనార్హం.

 దోహాలో అమెరికా, ఈజిప్ట్, ఖతార్‌ దేశాల మధ్యవర్తులు హమాస్‌–ఇజ్రాయెల్‌ యుద్ధం ముగింపు కోసం సంధి ప్రయత్నాలు చేస్తున్నవేళ ఈ దాడులు జరగడం గమనార్హం. గాజా సిటీని ఖాళీచేయాలంటూ బుధవారం ఇజ్రాయెల్‌ ఆకాశం నుంచి కరపత్రాలను వెదజల్లింది. హమాస్‌ మిలిటెంట్లు మళ్లీ గాజాసిటీలో ఎక్కువవడంతో వారి నిర్మూలనే లక్ష్యంగా సాధారణ ప్రజలు నగరాన్ని ఖాళీచేసి దక్షిణంవైపు తరలిపోవాలని ఆ కరపత్రాల్లో ఇజ్రాయెల్‌ సైన్యం హెచ్చరించింది.   
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)