Breaking News

Israel-Hamas war: 90 మంది దుర్మరణం

Published on Sun, 07/14/2024 - 04:44

జెరుసలేం: గాజాలోని దక్షిణ ప్రాంత నగరం ఖాన్‌ యూనిస్‌పై శనివారం ఇజ్రాయెల్‌ ఆర్మీ మళ్లీ విరుచుకుపడింది. తాజా దాడుల్లో 90 మంది మృతి చెందగా కనీసం 300 మంది పాలస్తీనియన్లు క్షతగాత్రులయ్యారు. హమాస్‌ మిలటరీ విభాగం అధిపతి మహ్మద్‌ డెయిఫ్‌ లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. హమాస్‌ మరో ముఖ్య నేత రఫా సలామాను కూడా ఆర్మీ లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు.

 ఈ దాడుల్లో వీరిద్దరూ చనిపోయిందీ లేనిదీ స్పష్టం చేయలేదు. ఫెన్సింగ్‌తో ఉన్న హమాస్‌ స్థావరంపై జరిపిన దాడిలో కొందరు మిలిటెంట్లు కూడా హతమైనట్లు ప్రకటించింది. అయితే, ఉత్తర రఫా– ఖాన్‌ యూనిస్‌ మధ్యలో ఇజ్రాయెల్‌ ఆర్మీ రక్షిత ప్రాంతంగా ప్రకటించిన మువాసిలోనే ఈ దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లక్షలాదిగా పాలస్తీనియన్లు తలదాచుకున్న మువాసిపైకి కనీసం ఏడు క్షిపణులు వచ్చి పడ్డాయని అంటున్నారు. 

ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు, కాలిపోయిన కార్లు, టెంట్లు, నల్లగా మసిబారిన గృహోపకరణాలు నిండిపోయి ఉన్నాయి. దాడి తీవ్రతకు చిన్నారుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయని, తమ చేతులతోనే వాటిని ఏరుకోవాల్సి వచ్చిందని ఓ వ్యక్తి రోదిస్తూ తెలిపాడు. బాధితుల్ని కార్లు, గాడిదల బండ్లు, దుప్పట్లలో వేసుకుని సమీపంలోని నాసర్‌ ఆస్పత్రికి స్థానికులు తరలించారు. ఇజ్రాయెల్‌ ఆర్మీ ప్రకటనను హమాస్‌ ఖండించింది. 

అక్కడ డెయిఫ్‌ సహా తమ నేతలెవరూ లేరని స్పష్టం చేసింది. భయంకరమైన ఊచకోతను కప్పిపుచ్చుకునేందుకే ఇజ్రాయెల్‌ ఆర్మీ ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తోందని మండిపడింది. ఇజ్రాయెల్‌ చెబుతున్నదే నిజమైతే గత తొమ్మిది నెలల యుద్ధంలో సాధించిన కీలక విజయమవుతుందని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో శాశ్వత కాల్పుల విరమణ, బందీల విడుదల లక్ష్యంగా అమెరికా మధ్యవర్తిత్వంతో సాగుతున్న చర్చలకు తాజా ఘటన అవరోధంగా మారుతుందని చెబుతున్నారు.

ఎవరీ డెయిఫ్‌..?
ఇజ్రాయెల్‌ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో హమాస్‌ మిలటరీ వి భాగం చీఫ్‌గా వ్యవహ రిస్తున్న డెయిఫ్‌ది మొదటి పేరు. గత రెండు దశాబ్దాల్లో ఇజ్రాయె ల్‌ నిఘా విభాగాలు పలుమార్లు చేసిన హత్యాయత్నాల నుంచి డెయిఫ్‌ త్రుటిలో తప్పించుకున్నాడు. అప్పట్లో గాయపడిన ఇతడు పక్షవాతం బారినపడుతున్నట్లుగా భావిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌ ఏడో తేదీన హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ దక్షిణ ప్రాంతంపై జరిపిన మెరుపుదాడికి సూత్రధారి డెయిఫే అని ఇజ్రాయెల్‌ అనుమానిస్తోంది. 30 ఏళ్ల వయస్సులో ఇతడి ఒకే ఒక్క ఫొటో తప్ప మరే ఆధారం ఇజ్రాయెల్‌ ఆర్మీ వద్ద లేదు.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)