Breaking News

Israel-Hamas war: తిండి కోసం ఎగబడ్డ వారిపై కాల్పులు.. గాజాలో ఘోరం

Published on Fri, 03/01/2024 - 06:05

రఫా: యుద్ధంలో సర్వం కోల్పోయి ఉండటానికి ఇల్లు, తింటానికి తిండి లేక అంతర్జాతీయ సాయం కోసం పొట్టచేతబట్టుకుని అర్ధిస్తున్న అభాగ్యులపైకి ఇజ్రాయెల్‌ తుపాకీ గుళ్ల వర్షం కురిపింది. గురువారం పశ్చిమ గాజాలో ఇజ్రాయెల్‌ జరిపిన ఈ అమానవీయ దారుణ దాడి ఘటనలో 100 మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 66 మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. 760కిపైగా గాయపడ్డారు.

మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మానవత్వాన్ని కాలరాస్తూ హమాస్‌–ఇజ్రాయెల్‌ యుద్ధం జరుగుతున్న తీరును తాజా ఘటన మరోసారి కళ్లకు కట్టింది. పశ్చిమ గాజాలోని షేక్‌ అజ్లీన్‌ ప్రాంతంలోని హరౌన్‌ అల్‌ రషీద్‌వీధి ఈ రక్తపుటేళ్లకు సాక్షీభూతమైంది. తాజాగా దాడితో ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ భూతల, గగనతల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 30,000 దాటింది. క్షతగాత్రుల సంఖ్య 70,457 దాటేసింది.


మృతదేహాలు గాడిదలపై..
ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. రోజుల తరబడి సరైన తిండిలేక అలమటించిపోతున్న పాలస్తీనియన్లకు పంచేందుకు ఆహార పొట్లాలు, సరుకు నిండిన ట్రక్కులు అల్‌ రషీద్‌ వీధికొచ్చాయి. అప్పటికే వందలాదిగా అక్కడ వేచి ఉన్న పాలస్తీనియన్లు ట్రక్కుల చుట్టూ గుమికూడారు. ఇజ్రాయెల్‌ సైన్యం పర్యవేక్షణలో ట్రక్కుల నుంచి ఆహార పంపిణీ జరగాల్సి ఉంది.

అయితే క్యూ వరసల్లో నిల్చున్న వ్యక్తులను కాదని చాలా మంది ట్రక్కులపైకి ఎగబడి గోధుమ పిండి, క్యాన్లలో ప్యాక్‌ చేసిన ఆహారాన్ని లూటీ చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పి గందరగోళం నెలకొంది. తోపులాట, తొక్కిసలాట జరిగాయి. వారించబోయిన ఇజ్రాయెల్‌ సైనికులపై వారు దాడికి పాల్పడ్డారని వార్తలొచ్చాయి. ‘‘ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇజ్రాయెల్‌ బలగాలు పాలస్తీనియన్లపైకి తుపాకీ గుళ్లవర్షం కురిపించాయి.

జనం పిట్టల్లా రాలి పడ్డారు. ఎక్కడ చూసినా మృతదేహాలే. మృతదేహాలు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు సరిపడా అంబులెన్సులు మా దగ్గర లేవు. విధిలేక గాడిదలపై, గాడిద బండ్లపై మృతదేహాలు, గాయపడిన వారిని తరలించాం’’ అని కమల్‌ అద్వాన్‌ ఆస్పత్రిలో అంబులెన్స్‌ సేవల అధికారి ఫరేస్‌ అఫానా చెప్పారు. లూటీ నుంచి తప్పించుకునేందుకు ట్రక్కులు ముందుకు కదలడంతో వాటి కింద పడి కొందరు మరణించారని వార్తలొచ్చాయి.  

మళ్లీ మళ్లీ కాల్పులు
ఘటన వివరాలను ప్రత్యక్ష సాక్షి, క్షతగాత్రుడు కమెల్‌ అబూ నహేల్‌ చెప్పారు. ‘ రెండు నెలలుగా పశుగ్రాసం తిని బతుకుతున్నాం. రాత్రిపూట ఆ వీధిలో ఆహారం పంచుతున్నారంటే వెళ్లాం. వందల మందిపై కాల్పులు జరిపారు. తప్పించుకునేందుకు కార్ల కింద దాక్కున్నాం. కాల్పులు ఆగిపోయాక మళ్లీ ట్రక్కుల దగ్గరకు పరుగెత్తాం. ఇజ్రాయెల్‌ సైనికులు మళ్లీ కాల్పులు జరిపారు. నా కాలికి బుల్లెట్‌ తగలడంతో కింద పడ్డా. అప్పటికే ముందుకు కదలిన ట్రక్కు నా కాలిని ఛిద్రంచేసింది’ అని నహేల్‌ చెప్పారు.  

చదవండి:  ఇజ్రాయెల్‌ కీలక ప్రకటన

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)