Breaking News

కాల్పుల విరమణ  నేటి నుంచే! 

Published on Sun, 01/19/2025 - 05:21

కైరో: ఇజ్రాయెల్‌ దాడులతో శిథిలమైన గాజాపై నేటి నుంచి శాంతిరేఖలు ప్రసరించనున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి హమాస్, ఇజ్రాయెల్‌ మధ్య ఆరు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రానుంది. ఇజ్రాయెల్‌ కారాగారాల్లో మగ్గిపోతున్న పాలస్తీనియన్లు, పాలస్తీనా రాజకీయ పార్టీల నేతలను ఈ 42 రోజుల్లోపు ఇజ్రాయెల్‌ అధికారులు విడిచిపెట్టనున్నారు.

 2023 అక్టోబర్‌ ఏడున ఇజ్రాయెల్‌ శివారు గ్రామాలపై దాడిచేసి కిడ్నాప్‌ చేసి బందీలుగా ఎత్తుకెళ్లిన వారిలో కొందరిని హమాస్‌ విడిచిపెట్టనున్నారు. సాయంత్రం 4 గంటలతర్వాతే బందీల పరస్పర బదిలీ మొదలవతుందని ఇజ్రాయెల్‌ చెబుతోంది. ఇరువైపులా బందీల కుటుంబసభ్యులు, బంధువుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 

తమ వారిని చూడబోతున్నామన్న ఆత్రుత వారిలో కన్పిస్తోంది. స్వేచ్ఛావాయువులు పీల్చబోతున్న వీళ్లందరికీ తక్షణ ఆహారంతో పాటు ఇతరత్రా సాయం అందించేందుకు మానవీయ సంస్థలు సిద్ధమయ్యాయి. అయితే ఇరువైపులా ఈ ప్రక్రియ ఎంత సజావుగా సాగుతుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి తోడు, బందీల జాబితా అందజేసేదాకా కాల్పుల విరమణ ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు శనివారం అర్ధరాత్రి మెలిక పెట్టారు! 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)