Breaking News

యెమెన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. హౌతీ ప్రధాని హతం?

Published on Fri, 08/29/2025 - 21:16

సనా: యెమెన్‌ రాజధాని సనాలో హౌతీ గ్రూప్‌కి చెందిన సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్‌ మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో హౌతీ గ్రూప్‌కి చావు దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్‌ దళాలు జరిపిన మెరుపు దాడుల్లో హౌతీ ప్రధాన మంత్రి అహ్మద్ అల్-రహావీ తన అపార్ట్‌మెంట్‌లో మృతి చెందినట్లు తెలుస్తోంది. అహ్మద్ అల్-రహావీతో పాటు హౌతీ రక్షణ మంత్రి మొహమ్మద్ అల్-అతిఫీ, చీఫ్ ఆఫ్ స్టాఫ్ అల్-ఘమారి కూడా మరణించినట్లు సమాచారం.

అయితే, వీరి మరణాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా ఇజ్రాయెల్‌ ఈ దాడులను హౌతీల మిస్సైల్, డ్రోన్ దాడులకు ప్రతీకారంగా చేపట్టింది. ఈ దాడుల్ని  హౌతీ గ్రూప్‌  తీవ్రంగా ఖండిస్తోంది. ఐడీఎఫ్‌ తమ పౌర ప్రాంతాలపై దాడులు చేసిందని, ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ధ్వజమెత్తింది. మరోవైపు అహ్మద్ అల్-రహావీ మృతిని ధృవీకరిస్తూ యెమెన్‌ మీడియా సైతం పలు కథనాల్ని ప్రచురించింది. కానీ ఇజ్రాయెల్‌ అధికారికంగా ధృవీకరించలేదు.

కాగా, యెమెన్‌ రాజధాని సనాపై ఇజ్రాయెల్‌ చేసిన వైమానిక దాడుల్లో గత ఆదివారం ఆరుగురు మృతి చెందగా.. 86 మందికి గాయపడ్డారు. ఈ దాడుల్లో 10 ఇజ్రాయెలీ యుద్ధం విమానాలు రాజధాని సనాలోని కీలక ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. అసర్‌ చమురు క్షేత్రం, హిజాజ్‌ పవర్‌ ప్లాంట్‌ లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. అయితే, గత కొన్ని నెలలుగా హమాస్‌కు మద్దతుగా హూతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)