Breaking News

అథెనా కథ ముగిసింది

Published on Sat, 03/08/2025 - 06:26

కేప్‌ కనవెరాల్‌: ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ రెండో మిషన్‌ కూడా ఫెయిలయ్యింది. చంద్రుడిపైకి పంపిన ల్యాండర్‌ అథెనా పనిచేయకుండా పోయింది. టెక్సాస్‌కు చెందిన ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ సంస్థ స్పేస్‌ ఎక్స్‌ రాకెట్‌ ద్వారా ఫిబ్రవరి 26న అథెనాను పంపించింది. ఇందులో 11 పేలోడ్లు, సైంటిఫిక్‌ పరికరాలు ఉన్నాయి. 

చంద్రుని దక్షిణ ధ్రువానికి 160 కిలోమీటర్ల దూరంలోని నిర్ణీత ప్రదేశంలో ఇది ల్యాండవ్వాల్సి ఉంది. కానీ, 250 మీటర్ల దూరంలో అతికష్టమ్మీద, అదీ ఇరుకైన గుంతలో దిగింది. తను దిగిన ప్రదేశాన్ని, పొజిషన్‌ను తెలపడంతోపాటు కొన్ని ప్రయోగాలకు సంబంధించిన పరికరాలను సైతం యాక్టివేట్‌ చేసినట్లు ఫొటోలను పంపించింది.

 వీటిని బట్టి చూస్తే ఇది ఇరుకైన గుంతలో పక్కకు ఒరిగి ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు శుక్రవారం తేల్చారు. ల్యాండర్‌కు ఉన్న సౌర ఫలకాలున్న తీరు, గుంతలోని అతి శీతల పరిస్థితులను బట్టి చూస్తే, అథెనా బ్యాటరీలను రీఛార్జి చేయడం అసంభవమని గుర్తించారు. దీంతో, అథెనా పనిచేసే అవకాశాలు లేవని ప్రకటించారు. మిషన్‌ పూర్తయినట్లు ప్రకటించిన అధికారులు అది పంపించిన చిత్రాలను విశ్లేషించి పనిలో పడ్డారని ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ తెలిపింది. అథెనా ఇంట్యూటివ్‌ రెండో మిషన్‌ కాగా, ఈ సంస్థ ఏడాది క్రితం పంపిన ఒడిస్సియస్‌ కూడా విఫలమైంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)