Breaking News

Indonesia: అదృశ్యమైన రైతు.. భారీ కొండచిలువ కడుపులో..

Published on Mon, 07/07/2025 - 12:15

జకార్తా: ప్రపంచంలో జరిగే కొన్ని ఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇండోనేషియాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. పొలంలో అదృశ్యమైన ఒక రైతు 26 అడుగుల భారీ కొండచిలువకు చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆగ్నేయ సులవేసిలోని దక్షిణ బుటన్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఈ ఘటనపై సౌత్ బుటన్ ప్రాంతీయ విపత్తు నిర్వహణ సంస్థ (బీపీబీడీ) అత్యవసర, లాజిస్టిక్స్ విభాగం హెడ్‌  లావోడ్ రిసావల్ మాట్లాడుతూ ఒక రైతు శుక్రవారం ఉదయం తన తోటకు వెళ్లి తిరిగి రాలేదు. తరువాత అతనిని భారీ కొండచిలువ మింగినట్లు స్థానికులు గుర్తించారని తెలిపారు. తోటలో ఆ కొండచిలువ ఇబ్బంది పడటాన్ని చూసి, ఏదో భారీ జంతువును మింగి ఉంటుందని భావించి, దానిని చీల్చివేశారన్నారు. అప్పుడు వారు దాని కడుపులో రైతు మృతదేహాన్ని చూసి షాకయ్యారన్నారు.

ఈ ప్రాంతంలో ఒక కొండచిలువ మనిషిని మింగడం ఇదే మొదటిసారని లావోడ్ రిసావల్  తెలిపారు.కాగా 2017లోనూ ఇండోనేషియాలో ఇలాంటి  ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో 23 అడుగుల కొండచిలువ ఉబ్బిపోయి  కనిపించడంతో, స్థానికులు దానిని చీల్చి చూడగా, దానిలో 25 ఏళ్ల యువకుని మృతదేహం ఉంది.  ఈ తరహా భారీ కొండచిలువలు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లలో కనిపిస్తుంటాయి. ఇవి చిన్నచిన్న జంతువులపై దాడి చేస్తుంటాయి. మనుషులను మింగేందుకు అరుదుగా ప్రయత్నిస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)