Breaking News

ట్రాక్ దాటుతున్న ట్రక్కును ఢీకొట్టిన రైలు.. 

Published on Thu, 07/20/2023 - 13:34

జకార్తా: ఇండోనేషియాలో రైల్వే గేటు వద్ద రైలు వచ్చే సమయంలో ట్రాక్ దాటేయాలన్న ఉద్దేశ్యంతో పట్టాలు మీదకి దూసుకు వచ్చిన ట్రక్కును పాసింజరు రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. భారీగా మంటలు చెలరేగడంతో రైలులోని ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. 

ఇండోనేషియాలోని సెమరాంగ్ పట్టణంలో జులై 18న ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్ రైలు బ్రంతాస్ 112 వస్తోన్న నేపథ్యంలో ఆపరేటర్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ట్రక్కు డ్రైవర్ అదేమీ పట్టించుకోకుండా ఈలోపే ట్రాక్ దాటేయవచ్చన్న తాపత్రయంలో ముందుకు వెళ్ళాడు. రెప్పపాటులో రైలు వచ్చి ట్రక్కును బలంగా ఢీకొట్టింది. సుమారు 50 మీటర్ల దూరానికి ట్రక్కును ఈడ్చుకుంటూ వెళ్ళగా భారీగా మంటలు కూడా చెలరేగాయి. 

ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారికి గానీ, వీడియోలో చూసినవారికి గానీ ప్రాణనష్టం కూడా భారీగానే జరిగి ఉంటుందనిపించక మానదు. కానీ అదృష్టవశాత్తు ట్రక్కు డ్రైవర్, రైలు లోకో పైలెట్ ఇద్దరికీ ఎటువంటి గాయాలు కాలేదు సరికదా క్షేమంగా బయటపడ్డారు. కానీ పెద్ద ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో రైలు నుంచి దూకేసిన ఒక ప్రయాణికుడికి మాత్రం గాయాలయ్యాయి. 

ఇది కూడా చదవండి: పెళ్ళిలో అపశ్రుతి.. భర్తను కాకుండా మామను పెళ్లాడిన వధువు.. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)