గాజాకు ఇండోనేషియా సైనిక దళాలు

Published on Tue, 02/10/2026 - 18:20

బాలి: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం తర్వాత అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశలో భాగంగా గాజాలో శాంతి స్థాపన కోసం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ (ఐఎస్‌ఎఫ్‌) కు ఇండోనేషియా తొలి దేశంగా సైనిక దళాలను పంపేందుకు సిద్ధమైంది.

గాజాలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) వెనక్కి తగ్గిన తర్వాత, అక్కడి భద్రతా పరిస్థితులను పర్యవేక్షించడానికి అంతర్జాతీయ శాంతి దళాలను ఏర్పాటు చేయాలని అమెరికా మధ్యవర్తిత్వంతో నిర్ణయించారు. ఈ దళాలు స్థానిక ప్రజల రక్షణ, మౌలిక వసతుల పునరుద్ధరణ, శాంతి వాతావరణాన్ని కొనసాగించడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తాయి. 

ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన దేశం ఇండోనేషియా ఇప్పుడు గాజాకు సైనికులను పంపేందుకు ముందడుగు వేసింది. గతంలో యుఎఇ, ఈజిప్ట్, ఇటలీ, అజర్‌బైజాన్, పాకిస్తాన్, ఖతర్, టర్కీ వంటి దేశాలు కూడా సహకారం అందిస్తామని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు ఏ దేశం కూడా స్పష్టమైన చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇండోనేషియా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.  

పలు నివేదికల ప్రకారం.. ఇప్పటికే వేలాది మంది ఇండోనేషియా సైనికులు గాజా దక్షిణ ప్రాంతంలో ప్రవేశించి, IDF స్థానాన్ని భర్తీ చేయనున్నారు. వీరు శాంతి భద్రతా చర్యలు, శరణార్థుల సహాయం, అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేయనున్నారు.  

ఇండోనేషియా నిర్ణయంపై అంతర్జాతీయంగా సానుకూల వాతవారణం నెలకొంది. ఇండోయనేషియా నిర్ణయంతో గాజా ప్రజలకు శాంతి, స్థిరత్వం తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో, ఇతర దేశాలు కూడా త్వరలో తమ దళాలను పంపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

గాజాలో యుద్ధం తర్వాతి పరిస్థితులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇండోనేషియా తీసుకున్న ఈ నిర్ణయం, అంతర్జాతీయ శాంతి దళాల ఏర్పాటులో ఒక కీలక మైలురాయిగా నిలుస్తోంది. ఇది కేవలం గాజా ప్రజలకు మాత్రమే కాకుండా, మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి స్థాపనకు కూడా ఒక కొత్త ఆశను కలిగిస్తోంది.

Videos

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)