Breaking News

మరో ఘనత.. సింగపూర్‌ అధ్యక్ష పీఠంపై భారతీయుడు

Published on Fri, 09/15/2023 - 05:54

సింగపూర్‌: అంతర్జాతీయ రాజకీయాల్లో మరో భారతీయుడు పతాకశీర్షికలకెక్కారు. సింగపూర్‌ నూతన అధ్యక్షుడిగా భారతీయ మూలాలున్న ఆర్థికవేత్త థర్మాన్‌ షణ్ముగరత్నం గురువారం ప్రమాణస్వీకారం చేశారు.

ఇటీవల ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన పోటీదారులైన చైనా మూలాలున్న ఎంగ్‌కోంక్‌ సాంగ్‌( 15.72 శాతం ఓట్లు), తన్‌కిన్‌ లియాన్‌ (13.88 శాతం)లను వెనక్కి నెట్టేసి ఏకంగా 70.4 శాతం ఓట్లు సాధించి షణ్ముగరత్నం ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.

అధ్యక్ష భవనం ఇస్టానాలో ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి, భారతీయ మూలాలున్న జడ్జి సుందరేశ్‌ మీనన్‌ ఈయనతో అధ్యక్షుడిగా ప్రమాణం చేయించారు. బహుళ జాతుల, సమ్మిళిత సమాజాభివృద్ధికి కృషిచేస్తానని అధ్యక్ష హోదాలో షుణ్ముగరత్నం హామీ  ఇచ్చారు. 66 ఏళ్ల షణ్ముగరత్నం ఆరేళ్లపాటు అధ్యక్షునిగా పాలన కొనసాగిస్తారు.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)