Breaking News

Texas: భారత సంతతి కంప్యూటర్‌ ఇంజినీర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

Published on Mon, 02/26/2024 - 09:34

టెక్సాస్‌: భారత సంతతికి చెందిన రీసెర్చర్‌ కంప్యూటర్‌ ఇంజినీర్‌ను అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. టెక్సాస్‌లో  అత్యున్నత అకడమిక్‌ అవార్డుగా పేరొందిన ఎడిత్‌ అండ్‌ పీటర్‌ ఓ డన్నెల్‌ అవార్డును ప్రొఫెసర్‌ అశోక్‌ వీరరాఘవన్‌కు అందజేశారు. ఈ అవార్డును ద టెక్సాస్‌ అకాడమీ ఆఫ్‌ మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(టామ్‌సెట్‌)ఏటా అత్యుత్తమ పరిశోధనలు చేసిన వారికి ప్రతి ఏటా అందిస్తుంది.

అశోక్‌ వీర రాఘవన్‌ హూస్టన్‌లోని  రైస్‌ యూనివర్సిటీకి చెందిన జార్జ్‌ ఆర్‌.బ్రౌన్‌ స్కూల్‌లో ఎలక్ట్రికల్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇమేజింగ్‌ టెక్నాలజీలో చేసిన పరిశోధనలకుగాను వీరరాఘవన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డు అందుకున్న సందర్భంగా వీరరాఘవన్‌ మాట్లాడుతూ ‘అవార్డు అందుకున్నందుకు సంతోషంగా ఉంది.

ప్రస్తుత ఇమేజింగ్‌ టెక్నాలజీలో చాలా సమస్యలున్నాయి. కాంతి ప్రసరించకుండా అడ్డంకులున్నచోట మనకు కావాల్సిన వాటిని చూడలేకపోతున్నాం. దీనిని అధిగమించేందుకు మేం చేసిన పరిశోధనలు చాలా వరకు పరిష్కారాన్ని కనుగొన్నాయి. ఉదాహరణకు కారు నడుపుతుంటే పొగమంచు వల్ల కాంతి పడకపోవడంతో ఎక్కువ దూరం రోడ్డును చూడలేకపోతున్నాం. విజిబిలిటీకి సంబంధించి ఇలాంటి సమస్యలు ఇక ముందు ఉండకపోవచ్చు’అని తెలిపారు. అశోక్‌ వీరరాఘవన్‌ తన బాల్యాన్ని తమిళనాడులోని చెన్నైలో గడిపారు.

ఇదీ చదవండి.. సౌర రేడియేషన్‌తో పెను ముప్పు 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)