Breaking News

Singapore: విజిటర్‌ను వేధించిన భారత నర్సుకు జైలు

Published on Sat, 10/25/2025 - 15:24

సింగపూర్‌: భారతీయ స్టాఫ్‌ నర్సుకు జైలు శిక్ష పడిన ఉదంతం సింగపూర్‌లో చోటుచేసుకుంది. ఆస్పత్రికి వచ్చిన ఒక పురుషుడిని వేధించినందుకు ఒక మేల్‌ నర్సుకు శిక్ష పడింది. సదరు మేల్‌ నర్సు కోర్టు ముందు నేరాన్ని అంగీకరించిన దరిమిలా అతనికి శిక్ష ఖరారయ్యింది. ఒక సంవత్సరం, రెండు నెలల జైలు శిక్షతోపాటు, రెండు బెత్తం దెబ్బలను అతనికి శిక్షగా విధించారు.

సింగపూర్‌లోని రాఫెల్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న  భారతీయ స్టాఫ్ నర్సు ఏలిపె శివ నాగు(34) జూన్ 18న లైంగిక వేధింపుల ఆరోపణల్లో దోషిగా తేలాడు. ‘ది స్ట్రెయిట్స్ టైమ్స్’ తెలిపిన వివరాల ప్రకారం రాఫెల్స్ ఆసుపత్రికి వచ్చిన ఒక పురుష సందర్శకుడిని శివ నాగు లైంగిక వేధింపులకు గురిచేశాడు. బాధితుని వయస్సు తదితర వివరాలను కోర్టు పత్రాలలో గోప్యంగా ఉంచారు. జూన్ 18న బాధితుడు నార్త్ బ్రిడ్జ్ రోడ్‌లోని రాఫెల్స్ ఆస్పత్రి వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతున్న తన తాతను చూసేందుకు వచ్చాడని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యూజీన్ ఫువా వివరించారు.

తరువాత ఏలిపె శివ నాగు ‘డిస్‌ఇన్‌ఫెక్ట్’ చేస్తానంటూ  బాధితుని దగ్గరకు వెళ్లి, తన చేతికి సబ్బు రాసుకుని అతనిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యూజీన్ ఫువా కోర్టులో తెలిపారు. ఈ ఘటన తర్వాత బాధితుడు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు.  జూన్ 18న ఈ ఘటన జరిగింది. జూన్ 21న బాధితుడు ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ నేపధ్యంలో పోలీసులు శివ నాగును అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆస్పత్రి యాజమాన్యం ఏలిపె శివ నాగును నర్సింగ్ విధుల నుంచి సస్పెండ్ చేసింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)