Breaking News

Yemen:16న భారతీయ నర్సుకు ఉరిశిక్ష అమలు

Published on Wed, 07/09/2025 - 07:25

సనా: యెమెన్‌లో మరణశిక్ష విధించిన భారతీయ నర్సు నిమిషా ప్రియకు జూలై 16న ఉరిశిక్ష అమలు చేయనున్నారు. దేశ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడం, సాయుధ దళాలను బలహీనపరిచే చర్యకు పాల్పడటంతో పాటు హత్య వంటి అనేక నేరాలకు యెమెన్ చట్టం మరణశిక్ష విధిస్తుంది. నిమిషా ప్రియ దేశం నుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెను అరెస్టు చేశారు. 2018లో ఆమె హత్యకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది.

యెమెన్ జాతీయుడి హత్యకు పాల్పడిన కేరళకు చెందిన నిమిషా ప్రియ మరణశిక్షకు గత ఏడాది యెమెన్ అధ్యక్షుడు ఆమోదం తెలిపారు. ఈ కేసులోని పరిణామాలను పరిశీలిస్తున్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించింది. ఆమెకు సాధ్యమైన సహాయాన్ని అందిస్తున్నామని తెలిపింది. నిమిషా ప్రియ తన తల్లిదండ్రుల పోషణా భారాన్ని భరించేందుకు 2008లో యెమెన్‌కు వెళ్లింది. పలు  ఆస్పత్రులలో పనిచేసిన ఆమె.. ఆ తరువాతి కాలంలో సొంత క్లినిక్‌ను ప్రారంభించింది. 2014లో తలాల్ అబ్దో మహదీ అనే స్థానికునితో కలసి క్లినిక్‌ను కొనసాగించింది.
 

అయితే ఆ తరువాత నిమిషా ప్రియకు మహదీతో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆమె అతనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. 2016లో అధికారులు అతనిని అరెస్టు చేశారు. తరువాత అతను జైలు నుండి విడుదలయ్యాడు. అప్పటి నుంచి ఆమెను బెదిరిస్తూ రాసాగాడు. అలాగే ఆమె  పాస్‌పోర్టును తీసుకున్నాడు. ఈ నేపధ్యంలో నిమిషా ప్రియ తన పాస్‌పోర్ట్‌ను తిరిగి దక్కించుకునేందుకు మహదీకి మత్తుమందు ఇచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే అది అధిక మోతాదు కావడంతో, మహదీ మృతిచెందాడు. వెంటనే నిమిషా ప్రియ దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా, ఆమెను అధికారులు అరెస్టు చేశారు. 2018లో యెమెన్ జాతీయుడిని హత్యచేసినందుకు ట్రయల్ కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. ఈ నిర్ణయాన్ని 2023 నవంబర్‌లో దేశ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ సమర్థించింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)