Breaking News

ఛీ..ఛీ.. విమానంలో వికృత చేష్టలు.. ఇండో అమెరికన్‌ వైద్యుని అరెస్టు..

Published on Sun, 08/13/2023 - 13:48

విమానంలో బాలిక ఎదుట అసభ్యంగా ప్రవర్తించిన భారత సంతతి వైద్యుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితునికి పక్కసీటులో కూర్చున్న బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై అభియోగాలు మోపారు. గత ఏడాది మేలో ఈ ఘటన జరగగా.. అనేక విచారణల తర్వాత అరెస్టు చేశారు.

సుదీప్త మొహంతీ(33) అమెరికాలోని బోస‍్టన్‌లో ఇంటర్నల్ మెడిసిన్, ప్రైమరీ కేర్ విభాగంలో వైద్యునిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది మే నెలలో స్నేహితురాలితో కలిసి బోస్టన్‌కు విమానంలో వెళుతున్నారు. కాగా పక్క సీటులో 14 ఏళ్ల మైనర్ బాలిక కూర్చుంది. ఆ బాలిక తన నానమ్మ తాతయ్యలతో ప్రయాణిస్తోంది. మొహంతీ పక్కనే బాలిక ఉండగా.. అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు. ఇది గమనించిన బాలిక పక్క సీటులోకి వెళ్లిపోయింది.

విమానం దిగగానే తన నానమ్మ, తాతయ్యలతో పాటు విమాన సిబ్బందికి తెలిపింది. బాలిక ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. మొహంతీపై కేసు నమోదు చేశారు. అనంతరం న్యాయస్థానం ముందు ప్రాథమికంగా హాజరుపరిచారు.  అప్పుడు ఆంక్షలను విధిస్తూ విడుదల చేశారు. విమానంలో అసభ్య చేష్టలకు పాల్పడితే అమెరికా శాసనం ప్రకారం అతనికి 90 రోజుల వరకు జైలు శిక్షతో పాటు 5000 అమెరికా డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. 

ఇదీ చదవండి: అమానవీయం: చికెన్ ఇవ్వలేదని.. చెప్పులతో దళితునిపై దాడి..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)