Breaking News

తెలుగింటి అల్లుడిపై ట్రంప్‌ ప్రశంసలు

Published on Wed, 11/06/2024 - 13:57

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవిని దాదాపు ఖరారు చేసుకున్న రిపబ్లికన్‌ పార్టీ అభ్ఘర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తమ పార్టీ నుంచి వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన సేన్‌ జేడీ వాన్స్‌పై ప్రసంశలు కురిపించారు. ఈయన భార్య ఉషా చిలుకూరి తెలుగు సంతతికి చెందినవారు.

ఇప్పటివరకూ వచ్చిన ఫలితాల ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయ పథాన దూసుకుపోతున్నారు. ఫలితాలు వెలువడుతున్న సమయంలో ట్రంప్‌ ఫ్లోరిడాలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన రిపబ్లికన్‌ పార్టీ వైస్‌ ప్రెసిడెంట్‌ అభ్యర్థి సేన్‌ జేడీ వాన్స్‌ తనకు అనుక్షణం అండగా నిలిచారంటూ ప్రసంశలు కురిపించారు. అలాగే అతని భార్య, తెలుగింటి ఆడపడుచు ఉషా చిలుకురి వాన్స్‌ను కూడా ట్రంప్‌ అభినందించారు.

జేడీ వాన్స్ భార్య ఉష చిలుకూరి తెలుగు సంతతికి చెందినవారు. గత ఏడాది వరకూ విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా  పనిచేసిన శాంతమ్మ మనుమరాలు ఉషా చిలుకూరి. అమెరికా ఉపాధ్యక్షునిగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి జేడీ వాన్స్‌ పేరు ఖరారైన దరిమిలా ఆయన భార్య ఉషా చిలుకూరి పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది.

ఉషకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో బంధువులు  ఉన్నారు. 90 ఏళ్ల వయస్సులోనూ విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు పలు పరిశోధనలు సాగిస్తున్న ప్రొఫెసర్‌ శాంతమ్మకు ఉష మనవరాలు అవుతారు. తెలుగు ప్రొఫెసర్‌గా సేవలు అందించిన శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి కొన్నేళ్ల  క్రతమే మృతి చెందారు. సుబ్రహ్మణ్యశాస్త్రి తమ్ముడు రామశాస్త్రి కుమారుడైన రాధాకృష్ణ కుమార్తెనే  ఉషా చిలుకూరి. 

అల్లుడిపై ట్రంప్‌ ప్రశంసలు

ఇది కూడా చదవండి: మస్క్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)