ఘోర ప‌రాజ‌యంపై రిషి సునాక్ క్ష‌మాప‌ణ‌లు

Published on Fri, 07/05/2024 - 09:57

బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార క‌న్జ‌ర్వేటివ్ పార్టీ ఘోర ప‌రాజయాన్ని మూట‌గ‌ట్టుకుంది. గురువారం మొద‌లైన ఓట్ల లెక్కింపులో ప్రతిపక్ష లేబర్ పార్టీకే ప్ర‌జ‌లు పట్టం క‌ట్టారు. దాదాపు 300కు పైగా స్థానాల్లో ముందంజ‌లో కొన‌సాగుతూ అధికారం చేప‌ట్టే దిశ‌గా దూసుకుపోతుంది. 

భారత సంతతికి చెందిన  ప్రధాని రిషి సునాక్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకన్జర్వేటివ్ పార్టీ  కేవ‌లం 63  స్థానాల్లో మాత్ర‌మే ఆధిక్యంలో ఉంది. ఓట్ల లెక్కింపు ఇంకా కొన‌సాగుతోంది. దీంతో బ్రిటన్‌ను 14 ఏళ్ల పాటు అప్రతిహతంగా ఏలిన కన్జర్వేటివ్‌ పార్టీకి భంగపాటు ఖాయంగా మారింది. 

ఇక బ్రిట‌న్ ఎన్నిక‌ల్లో క‌న్వ‌ర్జేటివ్ పార్టీ ఓట‌మిని ప్ర‌ధాని రిషి సునాక్ అంగీక‌రించారు. రిచ్‌మండ్ అండ్‌ నార్తర్న్ అలెర్టన్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి రిషి సునాక్ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో క‌న్వ‌ర్జేటివ్ పార్టీ ఓట‌మికి తాను బాధ్య‌త వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. ఇందుకు ఆయ‌న  దేశ  ప్ర‌జ‌ల‌ను క్ష‌మాప‌ణ‌లు కోరారు.

‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత కీర్ స్టామర్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను. అధికారం శాంతియుతంగా, స‌రైన ప‌ద్ద‌తిలో చేతులు మారుతుంది. ఇది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుంది’ అని సునాక్‌ అన్నారు.

ఈ క్ర‌మంలో లేబర్ పార్టీకి చెందిన కీర్ స్టార్మర్‌ (61) బ్రిటన్ తదుపరి ప్రధాన మంత్రి అవ‌నున్నారు.  ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయనే సంకేతాలు వెలువ‌డ‌టంతో ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘మార్పు చెందిన లేబర్‌ పార్టీపై నమ్మకం ఉంచిన కార్యకర్తలు, ఓటర్లకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)