Breaking News

తొలినాళ్లలో మనిషి ఏనుగులను తినేవాడా? పరిణామ క్రమంలో ఏం జరిగింది?

Published on Wed, 09/13/2023 - 09:39

భూమి చరిత్ర- మానవ పరిణామ ప్రకియ అనేవి దగ్గరి సంబంధం కలిగిన అంశాలు. మానవ పరిణామ క్రమంలో, ప్రకృతిలో మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పెద్ద జంతువులను అంతం చేయడం ద్వారా తొలి మానవుల పరిణామ ప్రక్రియ ముందుకు సాగిందని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడయ్యింది. తొలుత మానవులు తమ పోషణ కోసం పెద్ద జంతువులపై ఆధారపడేవారు. ఈ నేపధ్యంలో అవి అంతరించిపోవడంతో చిన్న జంతువులను వేటాడేందుకు ఆయుధాలు, సాధనాలను తయారు చేయవలసి వచ్చిందని పరిశోధకులు కనుగొన్నారు. 

ఈ అధ్యయనం కోసం పరిశోధకులు నాటి మానవులు వేట కోసం వినియోగించిన ఆయుధాలను పరిశీలించారు. ఆహారం పరిమాణం, మానవ సాంస్కృతిక, భౌతిక అభివృద్ధికి మధ్య విడదీయరాని సంబంధం ఉందని కనుగొన్నారు. రెండు సంవత్సరాల క్రితం పరిశోధకుల పరికల్పనను పరీక్షించడానికి ఈ అధ్యయనం చేపట్టారు. చిన్న, చురుకైన జంతువులను వేటాడాల్సి రావడం అనేది తొలి మానవుల తెలివితేటల అభివృద్ధికి సహాయపడింది.

ఈ అధ్యయనంలో కీలకంగా వ్యవహరించిన టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ పురావస్తు శాస్త్రవేత్త మిక్కీ బెన్-డోర్ మాట్లాడుతూ ఏనుగుల వంటి పెద్ద జంతువులను వేటాడేందుకు చెక్క ఈటెలు సరిపోతాయని అన్నారు. అయితే జింక వంటి చిన్న జంతువులు పట్టుకోవడం చాలా కష్టమని, వాటిని చేజిక్కించుకునేందుకు చెక్క ఈటెలు సరిపోవని, ఈ నేపధ్యంలో నాటి మానవులు రాతి ఆయుధాలు ఆవిష్కరించారని పరిశోధకులు కనుగొన్నారు. 

తొలి మానవుల్లో ఒకరైన హోమో ఎరెక్టస్ చెక్క ఈటెలను ఉపయోగించారు. నియాండర్తల్‌లు,హోమో సేపియన్‌లు సుమారు మూడు లక్షల సంవత్సరాల క్రితం రాతితో కూడిన ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించారు. 50 వేల సంవత్సరాల క్రితం హోమో సేపియన్లు విల్లు, బాణం, ఈటె లాంటి విసిరే ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించారు. అలాగే 25 వేల సంవత్సరాల క్రితం, వేట కోసం వలలతో పాటు శునకాల సహకారం తీసుకోవడం ప్రారంభమైంది.

ఈ తరహా ఆయుధాల అభివృద్ధితో మానవ వికాసం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. గత పదేళ్లుగా పలువురు పరిశోధకులు చరిత్రపూర్వ మానవ వికాసానికి సంబంధించిన అంశాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో  తొలినాళ్లలో ఏనుగులు చాలా కాలం పాటు మానవులకు ఆహారంగా ఉండేవని వారు కనుగొన్నారు. మూడు లక్షల సంవత్సరాల క్రితం అవి అంతరించడంతో నాటి మానవులు చిన్న జంతువులను వేటాడవలసి వచ్చింది. కాలానంతరంలో వేట సాధ్యం కానప్పుడు నాటి మానవులు పశుపోషణ, వ్యవసాయం ప్రారంభించారు. 2021లో, పరిశోధకులు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీనిలో తగ్గుతున్న ఆహార పరిమాణానికి వేటాడేందుకు వినియోగించే ఆయుధాల అభివృద్ధికి మధ్య  సంబంధం ఉందని తేల్చిచెప్పారు. ఇటీవల జరిగిన పరిశోధన కూడా ఈ సిద్ధాంతానికి మద్దతు నిచ్చింది. దీనిలో 1.5 లక్షల నుండి 20 వేల సంవత్సరాల క్రితం నాటి డేటాను అనుసంధానించారు.
ఇది కూడా చదవండి: వినోబా భావే హిమాలయ బాట ఎందుకు పట్టారు? గాంధీజీ సాంగత్యంతో ఏం జరిగింది?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌