Breaking News

సముద్రంలో పర్యాటకుల సయ్యాటలు.. సడన్‌గా షార్క్‌ దూసుకురావడంతో..

Published on Thu, 07/06/2023 - 07:55

అమెరికాలోని ఫ్లోరిడా సముద్రతీరంలో ఆ క్షణంలో భయానక వాతావరణం ఏర్పడింది. సముద్రంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా స్నానం చేస్తున్న వారి మధ్యలోకి ఉన్నట్టుండి ఒక భారీ షార్క్‌ ‍ప్రత్యక్షమయ్యింది. దీంతో వారంతా నీటిలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ భారీ షార్క్‌ నీటి మీద తేలియాడుతూ సముద్రంలో సేద తీరుతున్నవారి దిశగా దూసుకువచ్చింది.

ఈ షార్క్‌ను బీచ్‌లో నుంచి చూసినవారు సముద్రంలో సయ్యాటలాడుతున్న వారిని హెచ్చరిస్తూ బయటకు వచ్చేయండంటూ గట్టిగా కేకలు పెట్టారు. గతంలో న్యూయార్క్‌లోని ఫైర్‌ ఐలాండ్‌ను 15 ఏళ్ల కుర్రాడిని షార్క్‌ చంపేసినప్పటి నుంచి జనాలకు షార్క్‌లంటే విపరీతమైన భయం పట్టుకుంది. 

తాజాగా ఫ్లోరిడా బీచ్‌లో కనిపించిన షార్క్‌ భారీ ఆకారంతో ఉండటంతో అక్కడున్న వారంతా భయపడిపోయారు. ఆ క్షణంలో అక్కడ ఆందోళనకర వాతావారణం ఏర్పడింది. గతంలో షార్క్‌ దాడిలో బాలుడు మృతి చెందడం, దీనికి ముందు షార్క్‌ దాడిలో కొందరు గాయపడటాన్ని స్థానికులు మరోమారు గుర్తుచేసుకున్నారు. 

‘అది ఆ‍కలితో ఉన్నట్టుంది’
ఫ్లోరిడాలో ఆ సమయంలో సముద్రతీరంలో సేదతీరిన క్రిస్టీ కాక్స్‌ మాట్లాడుతూ తాను ఆ షార్క్‌ను చూసినప్పుడు అది ఆహరపు వేటలో ఉన్నట్లు అనిపించిదన్నారు. అందుకే అది వేగంగా కదులుతూ మనుషులవైపు వచ్చిందన్నారు. దానిని చూడగానే అక్కడున్న వారంతా నిశ్చేష్టులైపోయారన్నారు. ఎలాగోలా అందరూ దారి బారి నుంచి తప్పించుకున్నారన్నారు. కాగా గతంలో పలువురిపై షార్క్‌ దాడులు జరగగా, వారిలో కొందరు వికలాంగులుగా మారిపోయారు.

ఇది కూడా చదవండి: ‘ఇదేం పువ్వు రా బాబూ.. ముక్కు పేలిపోతోంది’

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)