Breaking News

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌: వెరైటీగా వీళ్లు ఏం చేస్తారంటే..

Published on Sat, 12/30/2023 - 13:23

కొత్త సంవత్సరాలు మనకి కొత్త గానీ, అనాది కాలగమనానికి కాదు!. అలుపుసొలుపు లేని నిత్య చైతన్యాలాపనకి కొత్తా పాతా ఏమిటి? అన్నాడో కవి. అయినా డిసెంబర్‌ 31 అర్ధరాత్రి ఆంగ్ల సంవత్సరాదికి ఆహ్వానం పలకడం.. అదో వేడుకగా జరగడం షరా మామూలు అయ్యింది. అయితే ఇక్కడ కొన్ని దేశాలు కొత్త సంవత్సరాన్ని వెరైటీగా ఆహ్వానించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.   


డెన్మార్క్ ప్రజలు స్నేహితులు, కుటుంబ సభ్యుల అందరూ కలిసి తలుపుల వద్ద పాత ప్లేట్లు, గ్లాసులను విసిరి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ విధంగా చేయడం వలన చెడు ఆత్మలు అదృశ్యమవుతాయని డెన్మార్క్ ప్రజల నమ్మకం. ఎవరి ఇంటి గుమ్మం వద్ద విరిగిన పాత్రలు ఎంత ఎక్కువ పేరుకుంటే.. ఆ ఇంట్లోని సభ్యులకు అంత మంచి జరుగుతుందని విశ్వాసం. 


న్యూ ఇయర్ సందర్భంగా.. ప్రతి అమెరికా ప్రజలు టీవీలకు, ఆన్‌లైన్‌లకు అతుక్కుపోతారు. న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌లో జరిగే బాల్‌ డ్రాప్‌ ఈవెంట్‌ అందుకు కారణం. ఇక్కడి వన్‌ టైమ్స్‌ స్క్వేర్‌పై ప్రతి సంవత్సరం అర్ధరాత్రి బాల్ డ్రాప్‌ ఈవెంట్‌ను వీక్షిస్తారు.  

కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ.. ప్రత్యేకంగా రూపొందించిన బాల్‌ను 31వ తేదీన రాత్రి వన్‌టైమ్స్‌ స్కైర్‌ పై నుంచి 11. 59 నిమిషాలకు డ్రాప్‌ చేస్తారు. ఇటీవల కాలంలో బాల్ డ్రాప్‌కు ముందు సంగీతకారుల ప్రదర్శనలతో  లైవ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌ను తొలిసారి ది న్యూయార్క్ టైమ్స్ న్యూస్‌పేపర్ యజమాని అడాల్ఫ్ ఓచ్స్ నిర్వహించారు. 1908 న్యూ ఇయర్‌కు వెల్‌కమ్‌ చెబుతూ 1907 డిసెంబర్‌ 31న తొలిసారి బాల్‌ డ్రాప్‌ ఈవెంట్‌ జరిగింది.  

టైమ్స్  కొత్త ప్రధాన కార్యాలయ భవనాన్ని ప్రచారం చేసేందుకు బాణాసంచాలతో న్యూ ఇయర్ ఈవెంట్‌ నిర్వహించారు. బంతి నిఆర్ట్‌క్రాఫ్ట్ స్ట్రాస్ కన్సల్టెంట్‌ కంపెనీ రూపొందించింది. కేందుకు డిసెంబర్ 31, 1907న మొదటిసారిగా బాల్ డ్రాప్ నిర్వహించబడింది. 1942, 1943లో యుద్ధకాల సమయాల్లో మినహా ప్రతది ఏడాది బాల్‌ డ్రాప్‌ ఈవెంట్‌ నిర్వహణ జరుగుతూ వస్తుంది.  

బాల్‌ డిజైన్‌ను నాలుగుసార్లు ఆధునీకరించారు. తొలినాళ్లలో బాల​ 5 అడుగులు( 1.5 మీ) వ్యాసం కలిగి ఉండేది. దీనిని చెక్క, ఇనుముతో తయారు చేసేవాళ్లు.ఇది దాదాపు 100 బల్బులతో ప్రకాశిస్తుంది. ప్రస్తుత బంతి 12 అడుగులు(3.7 మీ) వ్యాసం కలిగి ఉంది. దీనిలో 32,00 ఎల్‌ఈడీ బల్బ్‌లను ఉపయోగిస్తున్నారు.


బ్రెజిల్‌లో నూతన సంవత్సర వేడుకల కోసం ప్రజలు చాలా ప్రత్యేకమైన పనులను చేస్తారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక లోదుస్తులు ధరిస్తారు. ఇలా చేయడం వల్ల రాబోయే సంవత్సరంలో అదృష్టం వస్తుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.


ఫిన్లాండ్: ఫిన్లాండ్‌లో ప్రజలు రాబోయే సంవత్సరంలో జరగనున్న విశేషాల గురించి ఊహిస్తారు . దీని కోసం.. వారు కరిగిన టిన్‌ను నీటిలో ముంచి, లోహం గట్టిపడిన తర్వాత.. లోహానికి ఆకారంగా మార్చే పక్రియను చేపడతారు. ఈ లోహం గుండె లేదా ఉంగరం ఆకారాన్ని తీసుకుంటే.. అది వివాహం జరగడానికి చిహ్నం అని అర్థం. మరోవైపు  మెటల్ ఓడ రూపాన్ని తీసుకుంటే, అది ప్రయాణంతో ముడిపడి ఉంటుందని భావిస్తారు. 

12 గంటలకు.. 12 ద్రాక్షలు 
స్పెయిన్ దేశంలో కొత్త సంవత్సరం రోజున పాటించే సంప్రదాయం విచిత్రంగా ఉంటుంది. న్యూ ఇయర్ అర్ధరాత్రి 12 గంటలకు 12 ద్రాక్ష పండ్లను తినే సంప్రదాయం ఉంది. ఇలా చేయడానికి రీజన్ ఏమిటంటే.. 12 ద్రాక్షలు 12 నెలలు.. ద్రాక్ష రాబోయే సంవత్సరంలో ఒకొక్క ద్రాక్ష పండు ఒకొక్క నెల అదృష్టంతో ముడిపడి ఉంటుందట. స్పెయిన్‌లోని మాడ్రిడ్,  బార్సిలోనాలాంటి బడా నగరాల్లో 12 ద్రాక్షను సామూహికంగా ఆరగించేందుకు ప్రధాన కూడళ్లలో భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుంటారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)