Breaking News

హజ్‌యాత్ర ఎన్ని రోజులు ఉంటుంది? సౌదీ వెళ్లిన వారు అక్కడ ఏమి చేస్తారంటే..

Published on Tue, 06/27/2023 - 08:27

ఇస్లాంలో హజ్‌ యాత్రను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇస్లాంను అనుసరించే ప్రతీఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా హజ్‌ యాత్ర చేయాలని భావిస్తారు. ఇస్లాంను అనుసరించేవారు తప్పనిసరిగా  ఐదు విధులు పాటించాలని ఆ మత పెద్దలు చెబుతారు. దానిలో ఒకటే హజ్‌ యాత్ర. మిగిలినవి కల్మా, రోజా, నమాజ్‌, జకాత్‌. ముస్లింలు తమ జీవితంలో వీటిని పాటించేందుకు ప్రయత్నిస్తారు. 

యాత్ర ఎన్నాళ్లు సాగుతుంది?
ఇస్లాంను అనుసరిస్తున్న పెద్దలు తెలిపిన వివరాల ప్రకారం 628వ సంవత్సరంలో తొలిసారి పాగంబర్‌ మొహమ్మద్‌ తన 1,400 మంది అనుచరులతో ఒక పవిత్ర యాత్ర చేశారు. ఇస్లాంను నమ్మేవారు దీనినే తొలి తీర్థయాత్రగా చెబుతారు.ఈ యాత్ర ద్వారానే పాగంబర్‌ ఇబ్రహీమ్‌ ఇస్లాం సంప్రదాయాలను పునరుద్ధరించారని అంటారు. తరువాతి కాలంలో దీనినే హజ్‌ అంటూ వచ్చారు. ప్రతీయేటా ప్రపంచంలోని ఇస్లాం మతస్థులు సౌదీ అరబ్‌లోని మక్కాకు హజ్‌ కోసం వెళుతుంటారు. ఈ పవిత్ర హజ్‌ యాత్ర 5 రోజులు కొనసాగుతుంది. ఈ  యాత్ర ఈద్‌ ఉల్‌ అజహ​ అంటే బక్రీద్‌తో పూర్తవుతుందని చెబుతారు
 

జిల్‌-హిజాలోని 8వ తేదీన..
ఈ యాత్ర అధికారికంగా ఎప్పుడు ప్రారంభవుతుందనే విషయానికి వస్తే ఇస్లాం మాసం జిల్‌-హిజాలోని 8వ తేదీన ప్రారంభమవుతుంది. ఇదే రోజున హాజీ మక్కా నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరాన ఉన్న మీనా పట్టణానికి వెళ్లారని చెబుతారు. అక్కడ హాజీ రాత్రంతా గడిపారని అంటారు. మర్నాడు హాజీ అరాఫత్‌ మైదానానికి చేరుకున్నారట. ఈ అరాఫత్‌ మైదానంలో నిలుచుని హజ్‌యాత్రికులు అల్లాను గుర్తుచేసుకుంటారు. తాము చేసిన తప్పులను మన్నించాలని వేడుకుంటారు. తరువాత సాయంత్రానికి సౌదీ అరబ్‌లోని ముజదల్ఫా పట్టణం చేరుకుంటారు. రాత్రంతా అక్కడే ఉంటారు. మర్నాటి ఉదయం మీనా పట్టణానికి చేరుకుంటారు. 

హజ్‌యాత్రలో ముస్లింలు ఏం చేస్తారంటే..
హజ్‌ యాత్రకు వెళ్లిన ముస్లింలు ఒక విధానాన్ని ఫాలో అవుతారు. బీబీసీ రిపోర్టును అనుసరించి ముందుగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హజ్‌ యాత్రికులు ముందుగా జోద్దా పట్టణంలో కలుసుకుంటారు. సరిగ్గా మక్కాకు ముందుగా ఉన్న ఒక ప్రాంతం నుంచి అధికారికంగా యాత్ర ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతాన్ని మీకత్‌ అని అంటారు. ఈ ప్రాంతం మక్కాకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అహ్రమ్‌, ఉమ్రాలకు ఎంతో ప్రాధాన్యం
హజ్‌కు వెళ్లిన యాత్రికులంతా మీకత్‌కు చేరుకోగానే ఒక తరహా దుస్తులు ధరిస్తారు. దీనిని అహ్రమ్‌ అని అంటారు. అయితే కొందరు యాత్ర ప్రారంభించినది మొదలు అహ్రమ్‌ ధరిస్తారు. ఇది తెలుపు రంగు కలిగిన వస్త్రం. దీనిని సూదితో కుట్టరు.

ఉమ్రా విషయానికొస్తే మక్కా చేరుకున్న ప్రతీ ముస్లిం తప్పనిసరిగా ఉమ్రా పాటించాల్సి ఉంటుంది. ఉమ్రా అనేది ఇస్లాంలోని ప్రముఖ ధార్మిక ప్రక్రియ. ఇది కేవలం హజ్‌ మాసంలోనే కాకుండా సంవత్సరం పొడవునా ఎప్పుడైనా చేయవచ్చు. అయితే చాలామంది హజ్‌యాత్రకు వెళ్లినప్పుడు ఉమ్రాను తప్పకుండా ఆచరిస్తారు.

Videos

రవి కార్తీక్ కు జగన్ అభినందనలు..

జనసేన నేతలను చితక్కొట్టిన టీడీపీ అంబటి సెటైర్లు అదుర్స్

చుట్టమల్లే... ఆగలేదా? జూ.ఎన్టీఆర్ పై మళ్లీ...

పడిపోతున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే?

నామినేషన్ వేయకుండా ఆపుతున్న పోలీసులు

చంద్రబాబు గుర్తుపెట్టుకో.. చీర లాగి.. ఇంత దారుణంగా కొడతారా..? జనసేన నేత వార్నింగ్

ప్రసాద్ బాబుకు ఒక న్యాయం.. ఇందిరకు మరో న్యాయమా?

విడుదల రజిని ఘటనపై ధ్రువ్ రాఠీ స్పందన

అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. మైనింగ్ లో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

రాత్రి వేళ గోడలు ఎక్కుతూ వేటాడుతున్న వింత రాకాసి!

Photos

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు