Breaking News

America Britain Strikes : హౌతీల కీలక వ్యాఖ్యలు

Published on Sat, 01/13/2024 - 17:30

సనా: యెమెన్‌​ రాజధాని సనాలోని తమ స్థావరాలపై అమెరికా,బ్రిటన్‌లు సంయుక్తంగా చేస్తున్న దాడులను హౌతీ మిలిటెంట్లు తేలిగ్గా కొట్టి పారేశారు. దాడుల ప్రభావం తమపై పెద్దగా లేదని, దాడుల్లో ఎవరూ గాయపడలేదని హౌతీ  గ్రూపు సీనియర్‌ కమాండర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ సలాం చెప్పాడు. అయితే దాడులకు మాత్రం తాము గట్టిగా బదులిస్తామని స్పష్టం చేశాడు.

ఎర్ర సముద్రంలో నుంచి వెళ్లే ఇజ్రాయెల్‌తో సంబంధాలున్న అన్ని వాణిజ్య నౌకలపై తమ దాడులు కొనసాగుతాయని తెలిపాడు.‍ బ్రిటన్‌తో కలిసి హౌతీలపై చేస్తున్న వైమానిక దాడులపై అమెరికా వివరాలు వెల్లడించింది. తాము ఇప్పటివరకు జరిపిన దాడుల కారణంగా హౌతీలు మళ్లీ డ్రోన్‌లు, మిసైళ్లతో ఇప్పట్లో నౌకలపై దాడి చేయకపోచ్చని తెలిపింది. యెమెన్‌లో హౌతీలు డ్రోన్‌లు, మిసైళ్లు నిల్వ ఉంచిన స్థావరం తమ  దాడుల్లో పూర్తిగా ధ్వంసమైనట్లు అమెరికా వెల్లడించింది.

కాగా, హౌతీ సుప్రీం పొలిటికల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ మహ్మద్‌ అలీ అల్‌ హౌతీ మాట్లాడుతూ యెమెన్‌పై అమెరికా దాడులను ఉగ్రవాదంతో పోల్చాడు. అమెరికా ఒక పెద్ద దయ్యమని మండిపడ్డాడు. యెమెన్‌లోని హౌతీ స్థావరాలపై శుక్రవారం ప్రారంభమైన అమెరికా, బ్రిటన్‌ల వైమానిక దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. 

ఇదీచదవండి.. హౌతీలపై బ్రిటన్‌, అమెరికా దాడులు   

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు