Breaking News

Houthi Attacks: వెనక్కు తగ్గని హౌతీలు

Published on Tue, 02/06/2024 - 17:02

సనా: యెమెన్‌లోని తమ స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌ చేస్తున్న వైమానిక దాడులు, గస్తీలకు హౌతీ తిరుగుబాటుదారులు బెదరడం లేదు. తాజాగా ఎర్ర సముద్రంలో అమెరికా, బ్రిటన్‌కు చెందిన రెండు నౌకలపై విజయవంతంగా దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించారు. హౌతీ ప్రతినిధి యాహ్య సారె మాట్లాడుతూ ‘అమెరికా నౌక ‘స్టార్‌ నాసియా’పై తొలి బ్రిటీష్‌ నౌక ‘మార్నింగ్‌ టైడ్‌’పై దాడి చేశాం’ అని వెల్లడించారు. 

బ్రిటన్‌ నౌకపై దాడిని  ఆ దేశ సెక్యూరిటీ అండ్‌ ఇంటెలిజెన్స్‌ వింగ్‌ ఆంబ్రే ధ్రృవీకరించింది. యెమెన్‌లో హౌతీ మిలిటెంట్ల ఆధీనంలోని హుడేడా పోర్టు నుంచి జరిపిన క్షిపణి దాడిలో మార్నింగ్‌ టైడ్‌ నౌక స్వల్పంగా దెబ్బతిన్నట్లు పేర్కొంది. అయితే నౌకలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని వెల్లడించింది.

బార్బడోస్‌ జెండాతో వస్తున్న ఈ నౌక బాబ్‌ ఎల్‌ మండెప్‌ జలసంధి దాటగానే స్పీడ్‌ పెంచినప్పటికీ హౌతీల దాడికి చిక్కిందని బ్రిటన్‌ తెలిపింది. నౌకపై యాంటీ షిప్‌ మిసైల్‌తో దాడి జరిగినట్లు సమాచారం. ఈ నౌక బ్రిటన్‌లోని ఫురాడినో కంపెనీకి చెందినదిగా గుర్తించారు. తమ నౌక ప్రస్తుతం ప్రయాణం కొనసాగిస్తోందని కంపెనీ పేర్కొంది. 

కాగా, ఎర్ర సముద్రంలో వాణిజ్య  నౌకలపై దాడులు చేస్తున్న హౌతీల ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు అమెరికా, బ్రిటన్‌ ఇటీవల మిలిటెంట్ల స్థావరాలపై దాడులు తీవ్రం చేసిన విషయం తెలిసిందే. యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్ల స్థావరాలపై అమెరికా, బ్రిటన్‌ సేనలు గత వారం బాంబులతో విరుచుకుపడ్డాయి. మిలిటెంట్లకు చెందిన పలు స్థావరాల్లో నౌకలపై దాడికి సిద్ధంగా ఉన్న క్షిపణులు ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి. 

ఇదీచదవండి.. పాక్‌ ఎన్నికల కోసం 54 వేల చెట్ల నరికివేత

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)