Breaking News

జూపార్కులో 10 రోజుల్లో 12 కోతుల మృతి

Published on Thu, 10/24/2024 - 11:00

హాంకాంగ్: హాంకాంగ్‌ జూ పార్కులో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగా 10 రోజుల వ్యవధిలో 12 కోతులు మృతిచెందాయి.  కొద్ది రోజుల క్రితమే జూపార్కులో ప్రమాదకర బ్యాక్టీరియా విస్తరణను అధికారులు గుర్తించారు.

మృతిచెందిన కోతులకు నిర్వహించిన పోస్ట్‌మార్టంలో జూ ఎన్‌క్లోజర్ల మట్టిలో ఒక రకమైన బ్యాక్టీరియా అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. తద్వారా ఇన్ఫెక్షన్ సోకింది. అనంతరం కోతులు సెప్సిస్ బారిన పడి మృతిచెందాయి. ఇన్ఫెక్షన్ వల్ల ఆ ‍కోతులలోని కణాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా అవయవాలు పనిచేయడం ఆగిపోయి, అవి మృతిచెందాయి. జూ కార్మికుల బూట్ల ద్వారా కలుషితమైన మట్టి జంతువుల ఎన్‌క్లోజర్‌లకు చేరిందని అధికారులు భావిస్తున్నారు. జంతువుల కోసం గుహలు, ఇతర ఆవాసాల నిర్మాణ పనుల సమయంలో కోతుల సామూహిక మరణాలు సంభవించాయి.

అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం మట్టి ద్వారా అంటువ్యాధులు సంక్రమించడమనేది సాధారణమే. కానీ జంతుప్రదర్శనశాలలలో ఇటువంటి సంఘటనలు చాలా అరుదు. బ్యాక్టీరియా సంక్రమణ కారణంగా కాటన్ టాప్ టామరిన్, వైట్-ఫేస్డ్ సాకి, కామన్ స్క్విరెల్ మంకీ, డి బ్రజ్జాతో సహా పలుకోతులు మృతిచెందాయి. మెలియోయిడోసిస్ అనేది కలుషితమైన మట్టి, గాలి లేదా నీటితో సంపర్కం ద్వారా వ్యాపించే ఒక అంటు వ్యాధి. ఇదే కోతుల ప్రాణాలను తీసింది. హాంకాంగ్‌ జూ పార్కు నగరం నడిబొడ్డున 14 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇన్ఫెక్షన్ కారణంగా కోతులు చనిపోవడంపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)