రెస్టారెంట్లలోకి పెట్‌ డాగ్స్‌!

Published on Sat, 07/11/2026 - 06:18

హాంకాంగ్‌: హాంకాంగ్‌లోని పెంపుడు కుక్కల యజమానులు, వారు ఇష్టంగా పెంచుకునే శునకాలకు సరికొత్త స్వేచ్ఛ లభించింది. ఈ పెంపుడు జంతువులు తమ యజమానులతో పాటే రెస్టారెంట్లలోకి ప్రవేశించే అవకాశం వచ్చింది. ఇందుకు సంబంధించిన దశాబ్దాలుగా కొనసాగుతున్న చట్టానికి చేపట్టిన సవరణలు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయి. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలోకి దృష్టి లోపం ఉన్నవారికి సాయపడే కుక్కలు, పోలీసు సిబ్బందికి చట్టపరమైన విధుల్లో సాయపడే కుక్కలకు మాత్రమే అనుమతించే నిబంధనలు 1994 నుంచి అమలవుతున్నాయి. 

తాజాగా, హాంకాంగ్‌ యంత్రాంగం పెంపుడు జంతువులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించే ఉద్దేశంతో కొత్త చట్టం తీసుకువచ్చింది. ఈ సంస్కరణల మొదటి దశలో భాగంగా గురువారం నుంచి 900 రెస్టారెంట్లకు తాజా మినహాయింపును వర్తింపజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నడిచే మెట్రో రైళ్లు, ప్రయాణికుల నౌకలు నడిచే కొన్ని మార్గాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందే జీవిత చరమాంకంలో ఉన్న రోగులు వీటిని తమ వద్దే ఉంచుకునేందుకు అవకాశం కల్పించారు. హాంకాంగ్‌లోని 2.40 లక్షల గృహస్తులు 4 లక్షలకు పైగా కుక్కలు, పిల్లులను పెంచుకుంటున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొత్తం గృహస్తుల్లో వీరు 9 శాతం వరకు ఉంటారు. 

శునకాలకు మర్యాదలపై శిక్షణ 
రెస్టారెంట్లలోకి పెంపుడు శునకాలకు కూడా ప్రభుత్వం అనుమతివ్వడంతో డాగ్‌ ట్రైనర్లు బిజీగా మారిపోయారు. నిబంధనలకు తగ్గట్గుగా మార్పుకు సిద్ధమవ్వడం కోసం యజమానులు తమ పెంపుడు జంతువులను ’డాగ్‌ డైనింగ్‌ వర్క్‌షాప్స్‌’కు తీసుకెళ్తున్నారు. ట్రెయినింగ్‌ సెషన్‌లో భాగంగా రెస్టారెంట్‌ వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి రెండు గంటలపాటు శునకాలకు వీరు శిక్షణ ఇస్తున్నారు. మొదట కుక్కల యజమానులు తమ పెంపుడు జంతువులను రెస్టారెంట్‌ చుట్టూ తిప్పడంతో ప్రారంభమవుతుంది. ఇతర కుక్కలను చూసినప్పుడు అవి అతిగా ఉద్వేగానికి గురికాకుండా, ప్రశాంతంగా ఉండేలా ప్రోత్సహించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. కుక్కలు పద్ధతిగా ప్రవర్తించేలా వాటికి కొన్ని చేతి సంజ్ఞలను అలవాటు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండటం, మనుషుల మధ్య ఎలా వ్యవహరించాలో వాటికి నేర్పుతున్నారు.

టేబుళ్లపైకి రానివ్వకూడదు 
ఆహారం ఇవ్వరాదు  
ప్రభుత్వ నిబంధన ప్రకారం కుక్కలను 1.5 మీటర్ల కంటే మించని బెల్ట్‌తో కట్టి ఉంచాలి. ఆ బెల్ట్‌ను ఒక వ్యక్తి కచ్చితంగా పట్టుకోవాలి లేదా ఒక వస్తువుకు కట్టి ఉంచాలి. అలాగే కుక్కలను టేబుళ్లపైకి రానివ్వకూడదు. మనుషులు మళ్లీ ఉపయోగించే పాత్రల నుంచి అవి నేరుగా ఆహారాన్ని తినకూడదు. ప్రభుత్వం గుర్తించిన కొన్ని పోట్లాడే జాతులకు చెందిన కుక్కలను మాత్రం రెస్టారెంట్ల ప్రాంగణంలోకి అనుమతించరు. రెస్టారెంట్లు కుక్కల కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని తయారు చేయరాదు. అయితే, వాటి కోసం ముందే ప్యాక్‌ చేసిన ఆహారాన్ని మాత్రం అందించవచ్చు. కాగా, ప్రభుత్వం నిర్ణయం వల్ల తమ వ్యాపారం మరింత పుంజుకుంటుందని కొన్ని రెస్టారెంట్ల యజమానులు భావిస్తున్నారు. 
 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)