Breaking News

స్వలింగ వివాహాలకు చట్ట బద్ధత

Published on Fri, 01/24/2025 - 05:48

బ్యాంకాక్‌: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే చట్టం థాయిలాండ్‌లో గురువారం అమల్లోకి వచ్చింది. దీంతో, మొదటిరోజే వందలాదిగా జంటలు ఒక్కటయ్యాయి. రాజధాని బ్యాంకాక్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌లో ఏర్పాటైన ఈ వివాహ వేడుకలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెళ్లికి నిర్వచనం మారుస్తూ థాయ్‌ ప్రభుత్వం పౌర స్మృతిలోని కీలకమైన 1448 నిబంధనను ఆమోదించగా, దేశవ్యాప్తంగా ఒక్క రోజే నమోదైన వివాహాలు 1,448 మార్కును దాటే అవకాశముందని అధికా రులు తెలిపారు. 

దావోస్‌లో ఉన్న ప్రధానమంత్రి షినవత్రా  ఈ సందర్భంగా స్వలింగ జంటలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎల్జీబీటీక్యూ వర్గం ఇంద్ర ధనస్సు జెండా థాయ్‌లాండ్‌పై రెపరెపలాడుతోంది’అంటూ ఫేస్‌బుక్‌ పేజీలో కామెంట్‌ పెట్టారు. జిల్లా మ్యారేజీ కార్యాలయాల్లో అధికారులు కొత్త జంటల కోసం పార్టీలు, ఫొటో బూత్‌లను ఏర్పాటు చేశారు. కప్‌ కేక్‌లను పంచిపెట్టారు. మొదటిగా పెళ్లి రిజిస్టర్‌ చేసుకున్న వారికి విమాన ప్రయాణ టిక్కెట్లను సైతం ఆఫర్‌ చేశాయి కొన్ని కంపెనీలు. ఇలాంటి మధుర క్షణాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు కొన్ని జంటలు సంతోషం వ్యక్తం చేశాయి. 

స్వలింగ వివాహం చట్టం ద్వారా ఏకమయ్యే వారు ఇకపై ఆస్తులను నిర్వహించుకోవచ్చు, వారసత్వంగా పొందొచ్చు పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు. తమ జీవిత భాగస్వామి అనారోగ్య పాలైతే వైద్య సదుపాయాలను వర్తింప జేసుకోవచ్చు, ఆర్థిక ప్రయోజనాలను పంచుకోవచ్చు. గతేడాది జూన్‌లో ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో ఉభయ సభలు దాదాపు ఏకగ్రీవంగా ఆమోదించాయి. 

సెప్టెంబర్‌లో థాయ్‌ రాజు దీనిపై సంతకం చేశారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన మూడో ఆసియా దేశం థాయ్‌ల్యాండ్‌. ఇప్పటి వరకు ఇలాంటి వివాహాలను నేపాల్, తైవాన్‌ చట్టాలు మాత్రమే గుర్తించాయి. థాయ్‌ పౌరస్మృతిలోని 70 సెక్షన్లు మార్చారు. మగ, ఆడ, భర్త, భార్య వంటి లింగ సూచక పదాలకు బదులుగా వ్యక్తి, భాగస్వామి అనే వాటిని చేర్చారు. అయితే, స్వలింగ జంటలు సరోగసీ ద్వారా కుటుంబాలను కలిగి ఉండాలంటే చట్టాల్లో మరో డజను వరకు మార్పులు చేపట్టాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)