Breaking News

Us: బైడెన్ వయసు.. హిల్లరీ క్లింటన్‌ కీలక వ్యాఖ్యలు

Published on Mon, 02/12/2024 - 07:29

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ వయసు,జ్ఞాపకశక్తిపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బైడెన్‌ వయసుపై మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్‌ వయసు సమస్య న్యాయమైనదేనని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. వయసు కారణంగా బైడెన్ జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఇటీవల ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. 

ఈ సమస్య వైట్ హౌస్‌ దృష్టిలోనూ ఉందని హిల్లరీ క్లింటన్‌ చెప్పారు. మరో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ విషయంలోనూ వయసు సమస్య ఉందన్నారు. యువ ఓటర్లను ఆకర్షించడంలో ఇద్దరికీ ఇబ్బందులు తప్పకపోవచ్చన్నారు. వయసు ఒక సమస్యేనని, అయితే ఓటర్లు ఉత్తమ అభ్యర్థిని ఎన్నుకోవడం ముఖ్యమన్నారు. అధ్యక్షుడిగా బైడెన్‌ మరోసారి ఎన్నిక కావాలని హిల్లరీ ఆకాంక్షించారు. ఆయన ఎన్నో మంచి పనులు చేశారని కితాబిచ్చారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున జో బైడెన్‌, రిపబ్లికన్ల తరపున ట్రంప్‌ మళ్లీ తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కాగా, బైడెన్‌ జ్ఞాపకశక్తి తగ్గిందనే విషయాన్ని ఇటీవలే ఒక నివేదిక తగిన సాక్ష్యాధారాలతో బహిర్గతం చేయడంతో ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే బైడెన్‌ వృద్ధాప్యాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకున్న రిపబ్లికన్లకు తాజా నివేదిక మరో శక్తివంతమైన ప్రచారాస్త్రమైంది. అయితే ఈ నివేదికలోని అంశాలన్నీ తప్పు అని 81 ఏళ్ల బైడెన్‌ ఖండించారు. 

ఇదీ చదవండి.. అమెరికాలో చిన్నారిని ఓవెన్‌కు బలి చేసుకుంది

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)