Breaking News

జైలర్‌ కన్నా ఖైదీల ఆదాయమే ఎక్కువ!

Published on Mon, 11/25/2024 - 06:24

బ్రిటన్‌ జైళ్లలో అధికారుల కంటే ఖైదీలే ఎక్కువ సంపాదిస్తున్నారు. రక్షణ కల్పించే అధికారులు, సెకండరీ టీచర్లు, బయో కెమిస్టులు, సైకోథెరపిస్టులు తదితరుల కంటే కూడా వారి ఆదాయం చాలా ఎక్కువట! అక్కడి కొన్ని బహిరంగ జైళ్లలో ఖైదీలను బయటికి వెళ్లి పని చేయడానికి కూడా అనుమతిస్తారు. అలా పనికి వెళ్లిన ఓ ఖైదీ గతేడాది ఏకంగా 46 వేల డాలర్ల (రూ.39 లక్షల) వార్షిక ఆదాయం ఆర్జించి రికార్డు సృష్టించాడు. మరో 9 మంది ఖైదీలు కూడా ఏటా 28,694 డాలర్ల (రూ.24 లక్షల) కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని హోం శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 

ఖైదీలకు పునరావాసంతో పాటు విడదలయ్యాక సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు వీలు కలి్పంచడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. అక్కడి జైళ్లలో ఖైదీలు పలు ఉద్యోగాలు చేస్తారు. లారీ డ్రైవర్లుగా చేసేవారి సంపాదన ఎక్కువ. కొందరు శిక్షాకాలం ముగియకముందే తాత్కాలిక లైసెన్సు సంపాదించేస్తారు. ఈ ఖైదీల్లో పలువురు ఆదాయపన్ను కూడా చెల్లిస్తుండటం విశేషం. కొందరు సేవా కార్యక్రమాలకు విరాళాలూ ఇస్తారు! బ్రిటన్లో జైలు గార్డుల సగటు వేతనం 35,000 డాలర్లు.     

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)