Breaking News

ఇజ్రాయెల్‌ అటాక్‌ సక్సెస్‌.. హిజ్బుల్లా టాప్‌ కమాండర్‌ హతం

Published on Wed, 07/31/2024 - 07:00

జెరూసలేం: గాజాలోని హిజ్బుల్లా మిలిటరీ లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. ఇక, తాజాగా ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో హిజ్బులా టాప్‌ కమాండర్‌ ఫువాద్‌ షుక్ర్‌ను హతమారిచ్చినట్టు ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కింది. కాగా, ఆక్రమిత గోలన్‌ హైట్స్‌పై రాకెట్‌ దాడికి ఫువాద్‌ కారణమని ఇజ్రాయెల్‌ చెబుతోంది.

ఇజ్రాయెల్‌ మిలటరీ తెలిపిన వివరాల ప్రకారం..హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ సీనియర్‌ కమాండర్‌ ఫువాద్‌ షుక్ర్‌ మృతిచెందాడు. బీరుట్‌ ప్రాంతంలో ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో అతడు మరణించాడు అని తెలిపింది. ఇక, ఇటీవల సాకర్‌ మైదానంలో దాడుల్లో 12 మంది చిన్నారుల మరణాలకు కారకుడు ఫువాద్‌ అని ఇజ్రాయెల్‌ పేర్కొంది. గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా దాడులకు షుక్ర్ నాయకత్వం వహించాడని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌ అడ్మిరల్‌ డేనియల్‌ హగారీ మాట్లాడుతూ.. ఫువాద్‌ షుక్ర్‌ హిజ్బుల్లా ఉగ్రవాదుల్లో ఎంతో సీనియర్‌ వ్యక్తి. అతడి నేతృత్వంలోనే హిజ్బుల్లా దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్‌లో అనేక మంది మరణాలకు అతడే కారణం. హిజ్బుల్లాకు సంబంధించి గైడెడ్‌ క్షిపణులు, క్రూయిల్‌ క్షిపణులు, యాంటీ-షిప్‌ రాకెట్స్‌, అధునాతన ఆయుధాలు అతడి ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు.

ఫువాద్‌ షుక్ర్‌పై అమెరికా రివార్డు..
లెబనాన్‌ హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థలో దీర్ఘకాలంగా షుక్ర్‌ పనిచేస్తున్నాడు. సంస్థ ప్రధాన కార్యదర్శి హసన్‌ నస్రల్లాకు సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. 1983లో బీరుట్‌లోని అమెరికా మెరైన్‌ కార్ప్స్‌ బ్యారక్స్‌పై దాడిలో కీలక పాత్ర పోషించాడు. ఆనాటి ఘటనలో 24 మంది అమెరికా సైనిక సిబ్బంది మృతి చెందారు. షుక్ర్‌ గురించి సమాచారం అందించిన వారికి అయిదు మిలియన్ల రివార్డు అందిస్తామని అమెరికా ప్రకటించింది.
 

ఇదిలా ఉండగా.. లెబనాన్‌లోని మిలిటెంట్‌ గ్రూపు హిజ్బుల్లా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. గాజా హమాస్‌ మిలిటెంట్లకు మద్దతుగా దాడులు చేస్తున్న హిజ్బుల్లాపై ఇజ్రాయెల్‌ పూర్తిస్థాయి యుద్ధానికి దిగింది. ఇజ్రాయెల్‌లోని ఓ ఫుట్‌బాట్‌ మైదానంపై శనివారం జరిగిన రాకెట్‌ దాడిలో 12 మంది పిల్లలు మరణించిన ఘటన ఇజ్రాయెల్‌ ఉత్తర సరిహద్దులో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ఈ దాడికి ప్రతిగా హిజ్బుల్లా స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులకు దిగింది. మరిన్ని దాడులు ఉంటాయని, ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. భవిష్యత్తు చర్యలపై ఇజ్రాయెల్‌ చర్చలు రాకెట్‌ దాడికి హిజ్బుల్లా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ స్పష్టం చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)