Breaking News

2022 హీట్‌ దెబ్బ.. వేల మంది దుర్మరణం

Published on Tue, 11/08/2022 - 07:34

కోపెన్‌హగ్‌: మునుపెన్నడూ లేని రేంజ్‌లో ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు యూరప్‌ను అతలాకుతలం చేశాయి. ఈ ఒక్క ఏడాదిలోనే అదీ యూరప్‌లోనే 15 వేల మందికి పైగా మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం ప్రకటించింది. 

వడగాల్పులకు ముఖ్యంగా స్పెయిన్‌, జర్మనీ దారుణంగా ప్రభావితం అయ్యాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. జూన్‌ నుంచి ఆగష్టు మధ్య యూరప్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కొన్ని శతాబ్దాలుగా ఇదే అత్యధిక కావడం గమనార్హం. దేశాల నుంచి సమర్పించిన నివేదికల ఆధారంగా కనీసం 15వేల మంది మరణించారని, ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో రీజినల్‌ డైరెక్టర్‌ ఫర్‌ యూరప్‌ అయిన హాన్స్‌ క్లూగే ఒక ప్రకటనలో వెల్లడించారు. 

స్పెయిన్‌లో 4వేల మరణాలు, పోర్చుగల్‌లో వెయ్యి, యూకేలో 3,200 మరణాలు, జర్మనీలో 4,500 మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. జూన్‌, జులై మధ్యకాలంలో 40 డిగ్రీల సెల్సీయస్‌ ఉష్ణోగ్రతలు బ్రిటన్‌కు ముచ్చెమటలు పోయించాయి. వేడిమి వల్ల ఒత్తిళ్లు, శరీరం చల్లదనంగా ఉండకపోవడం.. తదితర కారణాలతోనే మరణాలు సంభవించినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, డయాబెటిస్‌ ఉన్నవాళ్లకు అధిక వేడిమి మరింత ప్రమాదమని నిపుణులు తెలిపారు. 

కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే దశాబ్దాలలో పెరుగుతున్న వేడిగాలులు, ఇతర తీవ్రమైన వాతావరణ సమస్యలు.. మరిన్ని వ్యాధులు, మరణాలకు దారితీస్తుందని WHO పేర్కొంది.

ఇదీ చదవండి: నరకకూపం.. ప్రమాదం అంచున ప్రపంచం

Videos

కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్

ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్

కవిత లేఖ కల్లోలం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

YSR జిల్లాలో విషాదం

వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం

నా భర్తను కాపాడండి.. హరికృష్ణ భార్య ఎమోషనల్

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)