జపనీస్ కుర్రాళ్లకు గడ్డం ఎందుకు ఉండదు?

Published on Mon, 10/02/2023 - 06:58

జపనీస్ కుర్రాళ్లను మనం సినిమాల్లో, ఇంటర్నెట్‌లో చూసేవుంటాం. వారెవరూ గడ్డాలు పెంచుకోరనే విషయాన్ని మనం గమనించే ఉంటాం. జపాన్‌లో సాధారణ యువకుడు మొదలుకొని ప్రముఖ సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరూ క్లీన్ షేవ్‌తో కనిపిస్తుంటారు. దీంతో జపాన్ పురుషులకు గడ్డం పెరగదా లేకా వారు గడ్డం పెంచుకోవడాన్ని ఇష్టపడరా అనే ప్రశ్న మన మదిలో తలెత్తుతుంది. దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. 

జపనీస్ కుర్రాళ్లకు జట్టు పెరగదా?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర పురుషుల మాదిరిగానే జపనీస్‌ కుర్రాళ్లు గడ్డం పెంచుకోగలుగుతారు. అయితే వారి జుట్టు పెరుగుదల ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంటుంది. దీని వెనుక చాలా కారణాలున్నాయి. ఉదాహరణకు చల్లని ప్రాంతాల్లో నివసించే వారి శరీరంపై ఎక్కువ వెంట్రుకలు ఉంటాయి. వేడి ప్రదేశాలలో నివసించే వారి శరీరంపై తక్కువ వెంట్రుకలు ఉంటాయి. తూర్పు ఆసియా ప్రజలదీ అదేతీరు. అయితే జపాన్‌ విషయంలో ఈ సూత్రం వర్తించదు.

ఈడీఏఆర్‌ జన్యువు కారణంగా జపాన్ పురుషుల ముఖంపై తక్కువగా వెంట్రుకలు పెరుగుతాయి. ఈ వారసత్వం కొత్త తరాలకు బదిలీ అవుతుంది. వెంట్రుకల పెరుగుదలకు టెస్టోస్టెరాన్ హార్మోన్ కారణంగా నిలుస్తుంది. 19 నుండి 38 సంవత్సరాల వయస్సు గల యువకులలో టెస్టోస్టెరాన్ స్థాయి డెసిలీటర్‌కు 264-916 నానోగ్రాముల మధ్య ఉండాలి (ng/dl). అయితే దీనిలో అనిశ్చితి కారణంగా తూర్పు ఆసియా ప్రజలలో జుట్టు తక్కువగా పెరుగుతుంది.

గడ్డం ఎందుకు పెంచుకోరు?
జపనీస్ కుర్రాళ్లలో కొద్దిమంది మాత్రమే గడ్డం పెంచుతారు. చిన్నపాటి గడ్డం కలిగిన పురుషులు జపనీస్ చరిత్రలో కనిపిస్తారు. కొన్ని దేశాల్లో  గడ్డం కలిగి ఉండటం మగతనానికి చిహ్నంగా పరిగణిస్తుంటారు. అయితే గడ్డం దట్టంగా ఉండటమనేది సోమరితనానికి చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే జపనీస్‌ పురుషులు గడ్డం పెంచుకోరు. జపనీయుల భావనలో అందం అనేది కళ్లలో ఉంటుంది. అందుకేవారు వారు గడ్డం పెంచుకోవడంపై అంతగా దృష్టిపెట్టరు.
ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు?

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)