Breaking News

కమల పూర్వీకుల గ్రామంలో సందడి

Published on Wed, 11/06/2024 - 07:17

కమలా హారిస్‌ పూర్వీకుల గ్రామం తమిళనాడులోని మన్నార్‌గుడి జిల్లా తులసేంద్రపురంలో సందడి నెలకొంది. మంగళవారం స్థానిక ధర్మ శాస్త శ్రీ కేశవ పెరుమాళ్‌ ఆలయంలో జరిగిన అభిషేకం, అర్చన కార్యక్రమాల్లో అమెరికా, యూకేల నుంచి వచి్చన ముగ్గురు మహిళా అభిమానులు పాల్గొనడం విశేషం. వీరిని చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీరిలో ఒకరు అమెరికాలోని లాస్‌వెగాస్‌ నుంచి  వచ్చినట్లు తెలిపారు. 

కమలా హారిస్‌ గెలవాలని కోరుకుంటున్నామన్నారు. ఈ ఆలయ దేవత కమల తాత గోపాలన్‌ కుటుంబం కుల దైవమని ఆలయ పూజారి సెంథిల్‌ కుమార్‌ తెలిపారు. గోపాలన్‌ కుటుంబ సభ్యులు గతంలో ఆలయానికి రూ.లక్ష విరాళమిచ్చారంటూ అక్కడి శిలా ఫలకంపైన పేర్లను చూపించారు. 2014లో కమలా హారిస్‌ పేరిట జరిగిన కుంభాభిషేకం కోసం రూ.5 వేలు ఇచ్చారన్నారు. 

గోపాలన్‌ కుటుంబ సభ్యులెవరూ ప్రస్తుతం గ్రామంలో ఉండటం లేదన్నారు. గోపాలన్‌ బ్రిటిష్‌ ప్రభుత్వంలో అధికారిగా పనిచేశారు. ఆయన కుమార్తె శ్యామలే కమల తల్లి. 2021లో కమలా హారిస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలయ్యారు. ఆ సమయంలో కమల కోసం ఆమె పిన్ని, శ్యామల చెల్లెలు చిట్టి ఇదే ఆలయంలో పూజలు చేశారని పూజారి సెంథిల్‌ కుమార్‌ చెప్పారు. అమెరికా అధ్యక్షురాలిగా కమల గెలిస్తే ఊళ్లో అన్నదానం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక కౌన్సిలర్‌ అరుల్‌ మోళి తెలిపారు. 


 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)