Breaking News

హాంబర్గ్ విమానాశ్రయంలో కాల్పుల కలకలం..

Published on Sun, 11/05/2023 - 10:24

జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయంలోకి చొరబడిన ఓ ఆగంతకుడు  కాల్పుల కలకలం సృష్టించాడు. శనివారం రాత్రి విమానాశ్రయంలోకి కారుతో సహా దూసుకువచ్చిన ఆగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో విమానాశ్రయంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. 

ఈ ఘటన దరిమిలా హాంబర్గ్ విమానాశ్రయంలో ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. ‘కస్టడీ వివాదం’ ఈ ఘటనకు కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. శనివారం రాత్రి సుమారు 8 గంటలకు ఒక అగంతకుడు కారులో భద్రతా ప్రాంతం గుండా ఎయిర్‌స్ట్రిప్‌కి ఆనుకొని ఉన్న రహదారి పైకి కారుతో సహా దూసుకువచ్చాడు. అనంతరం తుపాకీతో రెండుసార్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. కాగా ప్రస్తుతానికి విమానాల టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లను నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 27 విమానాలు దెబ్బతిన్నాయని సమాచారం. కాల్పులు జరిపిన ఆ వ్యక్తి కారులో నుండి రెండు మండుతున్న బాటిళ్లను బయటకు విసిరినట్లు పోలీసులు తెలిపారు.దీంతో మంటలు చెలరేగాయన్నారు. 
ఇది కూడా చదవండి: నేపాల్‌లో మళ్లీ భూప్రకంపనలు.. తీవ్రత ఎంతంటే..

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)