Breaking News

లండన్‌లో దారుణం.. భారత సంతతి వ్యక్తి హత్య

Published on Sun, 06/14/2026 - 08:34

సాక్షి, లండన్‌: బ్రిటన్‌లో దారుణం జరిగింది. 26 సంవత్సరాలున్న గుర్బేజ్‌ సింగ్‌ అనే ఓ భారతీయ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. అయితే అతనిని చంపడానికి గల కారణాలేంటో ఇంకా తెలియలేదు. కాగా అతని మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడానికి అక్కడి భారతీయులు విరాళల సేకరణ చేపడుతున్నారు.

పశ్చిమ లండన్‌లోని సౌత్ఆల్  ప్రాంతంలో  తీవ్రమైన కత్తిపోట్ల దాడిలో 26 ఏళ్ల భారతీయ సంతతి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో మరణించిన యువకుడిని గురభేజ్ సింగ్  గా పోలీసులు గుర్తించారు. డార్మర్స్ వెల్స్ లేన్ జంక్షన్ సమీపంలోని నార్త్ రోడ్డుపై ఆయనపై ఈ దాడి జరిగింది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో 30 ఏళ్ల వయసున్న మరో వ్యక్తి తీవ్ర గాయాలతో పడి ఉన్నారని అతనని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని పోలీసులు పేర్కొన్నారు.

ఈ హత్యకు సంబంధించి ఘటనా స్థలంలోనే 20 నుండి 30 ఏళ్ల మధ్య వయసున్న ఏడుగురు పురుషులను పోలీసులు అనుమానితులుగా అరెస్ట్ చేశారు. అయితే, తదుపరి విచారణ తర్వాత వారిలో ఆరుగురిని ఎలాంటి కేసు లేకుండా విడుదల చేయగా, ఒకరికి మాత్రం బెయిల్ మంజూరు చేశారు. అతను తదుపరి తేదీలో విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది.

ఈ దారుణ ఘటన తర్వాత, గురభేజ్ సింగ్ భౌతికకాయాన్ని తిరిగి స్వదేశానికి రప్పించడానికి డాక్యుమెంటేషన్, రవాణా, అంత్యక్రియల ఏర్పాట్లు మరియు ఇతర ఖర్చుల కోసం Go Fund Me వెబ్‌సైట్‌లో ఒక విరాళాల ప్రచారాన్ని  ప్రారంభించారు. మొత్తం 16,000 యూరోల లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 737 మంది దాతల నుండి 11,114 యూరోల నిధులు సేకరించారు.

#

Tags : 1

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)