Breaking News

గూగుల్‌ అకౌంట్‌... వాడకుంటే డిలీటే!

Published on Mon, 08/21/2023 - 05:22

మీ గూగుల్‌ అకౌంట్‌ను ఈ మధ్య అసలే వాడటం లేదా? దాని వంక కన్నెత్తి చూసి రెండేళ్లయిందా? అయితే అది ఇక శాశ్వతంగా డిలీట్‌ అయిపోతుంది. ఈ మేరకు కొత్త పాలసీని 2023 డిసెంబర్‌ 1 నుంచి గూగుల్‌ అందుబాటులోకి తెస్తోంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేస్తూ గూగుల్‌ ఈ వారమే తన యూజర్లందరికీ మెయిల్స్‌ పంపింది. తాను అందించే అన్ని సరీ్వసులు, ప్రొడక్టులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ‘మా యూజర్లు అకౌంట్‌ను వాడటం మానేసినా వారి డేటా పూర్తిగా గోప్యంగా, సురక్షితంగా ఉండేలా చూడటమే మా లక్ష్యం. అకౌంట్‌ డిలీషన్‌ అందులో భాగమే’’ అని గూగుల్‌ ప్రకటించింది.  

వీటికి వర్తిస్తుంది  
► గూగుల్‌ అకౌంట్‌ను రెండేళ్ల పాటు సైన్‌ ఇన్‌ చేయకపోతే, వాడకపోతే.
► ఒకసారి డిలీట్‌ చేసిన అకౌంట్‌ తాలూకు జీ మెయిల్‌ అడ్రస్‌ను ఇంకెవరికీ కేటాయించబోరు.
► సేఫ్టీ, సెక్యూరిటీ కారణాల రీత్యా తన పాలసీని ఇలా అప్డేట్‌ చేస్తున్నట్టు గూగుల్‌ తెలిపింది.
► అయితే అకౌంట్‌ను డిలీట్‌ చేసే ముందు గూగుల్‌ పలుమార్లు రిమైండర్‌ మెయిల్స్‌ పంపుతుంది. అవి సదరు అకౌంట్‌తోపాటు యూజర్‌ తాలూకు రికవరీ అకౌంట్‌కు కూడా వెళ్తాయి.
► ఏదైనా చర్య తీసుకోవడానికి కనీసం 8 నెలల ముందు నుంచే ఈ మెయిల్స్‌ రావడం మొదలవుతుంది.


మీ గూగుల్‌ అకౌంట్‌ యాక్టివ్‌గా ఉండాలంటే...
► తరచూ లాగిన్‌ అవుతూ ఉన్నా...
► కనీసం రెండేళ్లకు ఒకసారైనా లాగిన్‌ అయినా...
► గూగుల్‌ డ్రైవ్‌ వాడినా...
► మెయిల్‌ పంపినా, చదివినా...
► యూట్యూబ్‌లో వీడియో చూసినా...
► ఏ గూగుల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసినా...
► థర్డ్‌ పార్టీ యాప్, సరీ్వస్‌ లను గూగుల్‌ ద్వారా సైన్‌ ఇన్‌ చేసినా మీ గూగుల్‌ ఖాతాకు ఎలాంటి ఢోకా ఉండదు.


మినహాయింపులున్నాయ్‌..
గూగుల్‌ అకౌంట్‌ డిలీషన్‌ పాలసీకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వాటి ప్రకారం రెండేళ్ల పాటు వాడకంలో లేని అకౌంట్లను డిలీట్‌ చేసే కొత్త విధానం ఈ కింది వాటికి వర్తించదు  
► యూట్యూబ్‌ చానల్స్, ఖాతాకు, కామెంట్లున్న గూగుల్‌ అకౌంట్‌
► డబ్బులతో కూడిన గిఫ్ట్‌ కార్డులున్న జీ మెయిల్‌ అకౌంట్‌
► పబ్లిషిడ్ అప్లికేషన్‌ ఉన్న అకౌంట్‌   


– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)