Breaking News

మంత్రి ఇంట్లో చోరీ.. కంప్లైంట్ ఇస్తే తిరిగి తన మెడకే చుట్టుకుని..  

Published on Tue, 07/25/2023 - 11:29

ఘనా: ఘనా దేశ పారిశుధ్యం, నీటి వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తోన్న సెసిలియా అబీనా డఫా ఇంట్లో భారీ మొత్తంలో చోరీ జరగడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ దొంగతనము గురించి బయటకు పొక్కగానే  ఒక మంత్రి ఇంట్లో అంత మొతం సొమ్ము ఎలా చేరిందంటూ కొత్త ప్రశ్నలు తలెత్తాయి. దొంగ సొమ్ము దొంగల పాలైతే తప్పేంటని ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ కేసులో తానిచ్చిన కంప్లైంట్ చివరికి తన మెడకే చుట్టుకున్నట్టైంది.         

ఘనా ప్రభుత్వంలో పారిశుధ్యం, నీటి వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సెసిలియా అబీనా డఫా(68) ఇంటిలో భారీ స్థాయిలో దొంగతనం జరిగింది. సుమారు ఒక మిలియన్ డాలర్లు, 3 లక్షల యూరోలు, మరో 3 లక్షల 50 వేల ఘనా కరెన్సీ నగదు 35వేల డాలర్లు, 95 వేల డాలర్ల విలువ చేసే నగలు దోచుకుని వెళ్లారు దొంగలు. అంత పెద్ద మొత్తం చోరీ జరగడంతో షాక్లో మంత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. 

భారీ స్థాయి దొంగతనం కాబట్టి ఈ వార్త ఆ నోటా ఈ నోటా వేగాంగా చేరి, మంత్రి ఇంట్లో అంత పెద్ద మొత్తంలో నగదు, నగలు ఉండటమేమిటని గుసగుసలాడారు నెటిజన్లు. సోషల్ మీడియా వేదికగా ఆమెపై అవినీతి ఆరోపణలు చేశారు.  పోయిన సొమ్ము గురించి కంప్లైంట్ ఇస్తే అదికాస్తా అక్రమ సంపాదన కేసుగా మారి తన మెడకే చుట్టుకోవడంతో పదవికి రాజీనామా చేశారు డఫా.  

అవినీతి ఆరోపణలు, తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో బాధ్యతగా పదవి నుండి తప్పుకున్న డఫాను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. రాజీనామా లేఖలో మా యింట్లో పోయిన నగదు మొత్తం ఎంతన్నది స్పష్టంగా చెప్పకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని రాశారు డాఫా. ఇదిలా ఉండగా నానా అకుఫో అడ్డో ప్రభుత్వం ఆమె రాజీనామాను ఆమోదిస్తూ, అవినీతి ఆరోపణలపై స్పందించకపోగా మంత్రిగా ఆమె చేసిన సేవలను కొనియాడారు.  

ఇది కూడా చదవండి: ఎంతకాలం అడుక్కుంటాం.. ముందు చేతిలో చిప్ప విసిరేయాలి

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు