Breaking News

యువతకు బంపరాఫర్‌.. సైన్యంలో చేరితే రూ. 2.5 లక్షల జీతం

Published on Fri, 01/23/2026 - 04:00

జర్మనీ.. రెండో ప్ర‌పంచ యుద్దం త‌ర్వాత తొలిసారి త‌మ సైనిక విస్తరణపై దృష్టిసారించింది. యూరప్ ఖండంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని తాయారు చేయడమే లక్ష్యంగా జర్మనీ అడుగులు వేస్తోంది. జర్మనీ సర్కార్‌ తమ సాయుధ దళాలను ఆధునీకరించడానికి 377 బిలియన్ యూరోల (సుమారు రూ.33,93,000 కోట్లు ) భారీ నిధిని కేటాయించింది.

ఇది ఆధునిక చరిత్రలోనే అతిపెద్ద రక్షణ బడ్జెట్లలో ఒకటి. రష్యా నుంచి పెరుగుతున్న ముప్పు, అంతర్జాతీయ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాల నేపథ్యంలో ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

యువతకు బంపర్ ఆఫర్..
యువతను సైన్యం వైపు ఆకర్షించడానికి జర్మనీ భారీ జీతాన్ని ఆఫర్ చేస్తోంది. కొత్తగా చేరే సైనికులకు నెలకు 2,600 యూరోలు(భారత కరెన్సీలో సుమారు రూ. 2,80,000) ఇవ్వనున్నారు. అదేవిధంగా ఉచిత నివాసం, ఉచిత వైద్య సౌకర్యాలు కూడా అందించనున్నారు. కాగా సైన్యం ఎంపిక సంబంధించి జర్మనీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. 

ఈ చట్టం ప్రకారం.. జర్మనీ సర్కార్ 18 ఏళ్లు నిండిన యువకులందరికీ  ఒక ఫారమ్‌ను పంపుతోంది. అందులో వారు తమ ఫిట్‌నెస్ లెవెల్స్‌, సైన్యంలో చేరడంపై ఆసక్తిని తెలియజేస్తూ సమాధానం కచ్చితంగా ఇవ్వాలి. అయితే సైన్యంలో చేరాలా? వ‌ద్దా అనేది? యువ‌త ఇష్టానికే ప్ర‌భుత్వం వ‌దిలేసింది. 

కానీ ఒక‌వేళ అనుకున్న సంఖ్య‌లో  (ఏడాదికి కనీసం 80,000 మంది) వాలంటీర్లు రాకపోతే, బ‌ల‌వంతంగా చేర్చుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. జర్మనీ సైన్యాన్ని 'బుండెస్‌వెహర్' అని పిలుస్తారు. ప్రస్తుతమున్న 1.8 లక్షల మంది సైనికులను 2035 నాటికి 2.6 లక్షలకు పెంచాలని జర్మనీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా  2 లక్షల మంది రిజర్వ్ సైన్యాన్ని కూడా సిద్దం చేయనున్నారు.

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)