Breaking News

జన్యులోపాల వల్లే కాఫీ చేదు 

Published on Mon, 02/03/2025 - 00:49

కాఫీ చుక్క గొంతులోకి దిగనిదే రోజు గడవని వారెందరో! కొందరేమో కాఫీ అంటేనే ముఖం చిట్లిస్తారు. అలాంటి వారికి కాఫీ నచ్చకపోవడానికి ప్రత్యేక కారణమే ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. కాల్చిన అరబికా కాఫీ చేదును నిర్ణయించడంలో ఆయా వ్యక్తుల జన్యువులు కీలక పాత్ర పోషిస్తున్నట్టు కనుగొన్నారు. కాఫీ గింజలను కాల్చడం వల్ల రుచి ప్రభావితం అవుతుందా, లేదా అన్న అంశంపై జర్మనీలోని మ్యూనిచ్‌ టెక్నికల్‌ వర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు.

 ‘కోఫియా అరబికా’ మొక్కకు చెందిన గింజలను కాల్చి పొడి చేస్తారు. కెఫీన్‌ సాధారణంగానే చేదుగా ఉన్నప్పటికీ కెఫీన్‌ తీసేసిన కాఫీ కూడా చేదుగానే ఉంటుంది. అరబికా బీన్స్‌లో ఉండే ‘మొజాంబియోసైడ్‌’ అనే పదార్థమే దీనికి కారణం. ఇది కెఫీన్‌ కంటే ఏకంగా 10 రెట్లు ఎక్కువ చేదుంటుంది! కాఫీ తాగినప్పుడు మనుషుల్లో ఉన్న 25 చేదు రుచి గ్రాహకాల్లో రెండింటిని అది యాక్టివేట్‌ చేస్తుంది. 

గింజలను కాల్చిన ఉష్ణోగ్రత, సమయాన్ని బట్టి అవి ఏడు రకాలుగా మారతాయి. ఒక్కో దశలో ఒక్కో రుచి కలిగి ఉంటాయి. ఈ ఏడు దశల్లోని కాఫీ కూడా రుచి గ్రాహకాలపై ప్రభావం చూపుతుంది. ఇలా కాల్చిన కాఫీ పొడి పదకొండు మందిలో ఎనిమిది మందికి చేదుగా అనిపించింది. వారిలో ఒక గ్రాహక జన్యువు లోపభూయిష్టంగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. రెండు జన్యువులు చెక్కు చెదరకుండా ఉన్న ఇద్దరికి మాత్రం కాఫీ చేదుగా అనిపించలేదు. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని శాస్త్రవేత్త లాంగ్‌ చెప్పారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)